Baingan Bharta : ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అని వంకాయ మీద పాటలు కూడా వచ్చాయి. వంకాయ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వంకాయ రుచి నచ్చని వాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. గుత్తి వంకాయ కూర మొదలు అనేక రకాల రెసిపీస్ ని మనం వంకాయలతో తయారు చేసుకోవచ్చు. చాలా మందికి వంకాయ బండ పచ్చడి అంటే కూడా చాలా ఇష్టం. అయితే, ఈరోజు మనం వంకాయతో సులభంగా తయారు చేయగలిగే ఒక అద్భుతమైన రెసిపీని చూద్దాం.
పాతకాలం నాటి బైంగన్ భర్తా ఎలా తయారు చేయాలో చూసి, తయారు చేసుకుంటే, ఇక అసలు విడిచిపెట్టరు. పదేపదే చేసుకుంటూ ఉంటారు. ఇలా, ఇక్కడ చెప్పినట్లు పక్కా కొలతలతో మీరు తయారు చేసుకుంటే, ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఇదివరకు నిప్పుల మీద వంకాయని కాల్చే వాళ్ళు. కానీ, ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద మనం కాల్చుకోవచ్చు. అన్నంలోకి, జొన్న రొట్టె, గోధుమ రొట్టెలోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇక ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
దీనికోసం ముందు మీరు ఒక పెద్ద వంకాయని కానీ చిన్న వంకాయలు నాలుగు కానీ తీసుకోండి. ఒక ఉల్లిపాయని సన్నని ముక్కలు కింద కట్ చేసి పెట్టుకోండి. టమాటాలని కూడా సన్నని ముక్కలు కింద కట్ చేసుకోండి. ఉల్లికాడల తరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా రెడీ పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, వంటనూనె, తగినంత ఉప్పు కావాలి. కొత్తిమీర కూడా కొంచెం తీసుకోండి.
వంకాయలను తీసుకుని బాగా కడుక్కుని, చాకుతో అక్కడక్కడ గాట్లు పెట్టుకోండి. ఇలా చేయడం వలన వంకాయలని కాల్చేటప్పుడు, లోపలి వరకు కూడా ఉడుకుతుంది. వంకాయలకి నూనె రాసి బాగా కాల్చుకోండి. బయట తొక్క మొత్తం తీసేసి లోపల గుజ్జు అంతటినీ ఒక దానిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకుని, రెండు చెంచాల నూనె వేసుకుని, నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా వేసేసి బాగా ఉడికాక పసుపు, కారం వేసుకుని కలుపుకోండి. చివరగా మీరు వంకాయ ముద్ద కూడా వేసుకుని కలుపుకుని రెండు నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత, కొత్తిమీర తరుగు చల్లుకోండి. అంతే, రుచికరమైన వంకాయ బైంగన్ భర్తా రెడీ అయిపోయింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…