ముఖ్య‌మైన‌వి

రోడ్ డాక్ట‌ర్‌ : త‌మ పెన్ష‌న్ డ‌బ్బుల‌తో హైద‌రాబాద్ న‌గ‌రంలోని రోడ్ల‌పై ఉన్న గుంత‌ల‌ను పూడుస్తున్న జంట‌.. ఇప్ప‌టి దాకా 2000కు పైగా గుంత‌ల‌ను పూడ్చారు.. హ్యాట్సాఫ్‌..!

రోడ్లను స‌రైన నాణ్య‌తా ప్ర‌మాణాలతో నిర్మించ‌క‌పోతే కొద్ది రోజుల‌కే వాటిపై గుంత‌లు ఏర్ప‌డుతుంటాయి. వాహ‌నాలు తిరిగే కొద్దీ, వ‌ర్షాల‌కు రోడ్లు దెబ్బ తింటాయి. ఈ క్ర‌మంలో రోడ్ల‌పై ఏర్ప‌డే గుంత‌ల్లో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతూ ప్ర‌యాణిస్తుంటారు. ఇక యాక్సిడెంట్లు కూడా జ‌రుగుతుంటాయి. అయితే రోడ్ల‌పై ఉన్న‌గుంత‌ల‌ను పూడ్చ‌మ‌ని అధికారుల‌కు ఎన్నిసార్లు చెప్పినా వారు ప‌ట్టించుకోరు. దీంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంటుంది. కానీ ఆ జంట మాత్రం వాహ‌న‌దారుల‌కు క‌లుగుతున్న ఇబ్బందుల‌ను తొల‌గిస్తున్నారు. గ‌త 11 సంవ‌త్స‌రాలుగా వారు రోడ్ల‌పై ఉన్న గుంత‌ల‌ను పూడుస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

హైద‌రాబాద్‌కు చెందిన 73 ఏళ్ల గంగాధ‌ర్ తిల‌క్ రోడ్ డాక్ట‌ర్‌గా పేరు గాంచారు. ఆయ‌న త‌న భార్య వెంక‌టేశ్వ‌రితో క‌లిసి గ‌త 11 ఏళ్లుగా రోడ్ల‌పై ఉన్న గుంత‌ల‌ను పూడుస్తున్నారు. తిల‌క్ 35 ఏళ్ల పాటు రైల్వేలో ఉద్యోగిగా పనిచేశారు. త‌రువాత హైద‌రాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఆ త‌రువాత 1 ఏడాది పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేశారు. అయితే ర‌హ‌దారుల‌పై ఉన్న గుంత‌ల వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుసుకుని వాటిని పూడ్చేందుకు న‌డుం బిగించారు. అలా 11 సంవ‌త్స‌రాల నుంచి ఆయ‌న, త‌న భార్య‌తో క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు 2030 వ‌ర‌కు గుంత‌ల‌ను పూడ్చారు.

త‌న‌కు వ‌చ్చే పెన్ష‌న్ మొత్తంతో ఓ వాహ‌నాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో గుంతల‌ను పూడ్చేందుకు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి, ప‌నిముట్లు ఉంటాయి. వాటితో గుంతల‌ను పూడుస్తున్నారు. అందుక‌నే తిల‌క్‌కు రోడ్ డాక్ట‌ర్‌గా పేరు వ‌చ్చింది. అయితే మొద‌ట్లో గుంత‌ల‌ను పూడ్చ‌మ‌ని అధికారుల‌కు వారు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారు. కానీ వారు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆ దంప‌తులే స్వ‌యంగా రంగంలోకి దిగారు. అప్ప‌టి నుంచి రోడ్ల‌పై గుంత‌ల‌ను పూడుస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో అధికారుల్లో చ‌ల‌నం వ‌చ్చింది. రోడ్ల‌పై గుంత‌ల‌ను పూడ్చేందుకు అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని వారు ఆ దంప‌తుల‌కు అంద‌జేస్తున్నారు. ఏది ఏమైనా తిల‌క్ లాంటి వ్య‌క్తులు స‌మాజంలో ఇంకా ఉన్నారు కాబ‌ట్టే ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందుతోంది. ఆయ‌న చేస్తున్న ప‌నికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM