---Advertisement---

అత్యంత అరుదైన, ఖరీదైన మియాజకి మామిడి కాయలు.. కాపలా కాసేందుకు సెక్యూరిటీ గార్డులు..

June 18, 2021 10:42 PM
---Advertisement---

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నివాసం ఉండే రాణి, సంకల్ప్‌ పరిహార్‌ దంపతులు కొన్నేళ్ల కిందట రెండు మామిడి మొక్కలను నాటారు. అవి ఇతర మామిడి మొక్కల్లాగే పెరిగి పెద్దగయ్యాయి. కాయలు కూడా కాశాయి. అవి రూబీ కలర్‌లో ఉండడం విశేషం. అయితే ఆ మామిడి పండ్లు జపాన్‌కు చెందిన అత్యంత అరుదైన జాతికి చెందిన మియాజకి అనే మామిడి వెరైటీకి చెందినవని వారు తరువాత గుర్తించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో మియాజకి మామిడి పండ్లను అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది. కేజీకి సుమారుగా రూ.2.70 లక్షల ధర పలుకుతాయి. ఎందుకంటే ఈ మామిడి పండ్లు చాలా తక్కువ సంఖ్యలో పండుతాయి. రుచి చాలా తియ్యగా ఉంటాయి. అందుకనే వీటికి అంత ఖరీదు ఉంటుంది.

rare and expensive miazaki mango trees security by guards and dogs

అయితే గతేడాది ఈ మామిడి పండ్లు కాశాక కొందరు దొంగలు కాయలను దొంగిలించారు. దీంతో ఆ దంపతులు ఈసారి తోటలో ఆరు కుక్కలు, నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు. వారు ఆ మామిడి చెట్లను, కాయలను కాపలా కాస్తున్నారు.

ఇక ఆ మామిడి పండ్లకు ఎంత రేటైనా సరే చెల్లించేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆ దంపతులు మాత్రం వాటిని తాము ఇప్పుడే అమ్మబోమని, వాటితో మరిన్ని చెట్లను పెంచుతామని చెబుతున్నారు. ఇక సైంటిస్టులు ఆ అరుదైన జాతికి చెందిన మామిడి పండ్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now