Who is Shriya Reddy : స‌లార్ ఫేం శ్రియా రెడ్డి.. ఆమె గురించి ఈ విష‌యం మీకు తెలుసా..?

December 27, 2023 5:02 PM

Who is Shriya Reddy : ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన స‌లార్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించిన అంద‌రికి మంచి గుర్తింపు ద‌క్కింది.ఈ చిత్రంలో బలమైన పాత్రతో ఆకట్టుకొన్న రాధా రమా మ‌న్నార్ పాత్ర క్యారెక్టర్‌లో తనదైన శైలిలో నటించిన శ్రీయా రెడ్డి కూడా మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఇప్పుడు శ్రియా రెడ్డి బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రంలొ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరదరాజ మన్నార్ పాత్రకు సోదరిగా శ్రియా రెడ్డి న‌టించారు.

శ్రియా రెడ్డి ఇదివరకే తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా విలనిజం పండించడంలో ఆమె నటన వేరేలెవల్. శ్రియా రెడ్డి ఓ మాజీ ఇండియన్ క్రికెటర్ కూతురు అన్న సంగతి చాలా మందికి తెలియదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన శ్రియా.. నిజానికి తెలుగమ్మాయే. మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ రెడ్డి కూతురు శ్రియా కాగా, ఆమె తండ్రి 1977 నుంచి 1981 మధ్య ఇండియన్ టీమ్ తరపున 4 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. భ‌ర‌త్ రెడ్డి కూతురు అయిన శ్రియ రెడ్డి కెరీర్ ప్రారంభంలో టీవీ ప్రజెంటర్, వీడియో జాకీగా పనిచేసింది. 41 ఏళ్ల ఈ నటి తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. 2002లో వచ్చిన సమురాయ్ మూవీతో పరిచయమైంది. 2006లో శర్వానంద్ నటించిన అమ్మ చెప్పింది మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

Who is Shriya Reddy important facts to know
Who is Shriya Reddy

తెలుగు కుటుంబం అయిన కూడా వారు కొన్ని ప‌రిస్థితుల‌లో చెన్నైలో స్థిర‌ప‌డ్డారు. 2008లో నటుడు విశాల్ అన్న విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకోవడం విశేషం. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పటి వరకూ పెద్దగా గుర్తింపు రాకపోయినా.. సలార్, పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలతో శ్రియా రెడ్డి పేరు వార్తల్లో నిలుస్తోంది.ఓజీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సెట్లో ప్రకాశ్ రాజ్‌తో నేను గొప్పంటే.. నేను గొప్ప అని పోట్లాడుకొన్నాం. సలార్, ఓజీ సినిమాల తర్వాత నేను రిటైర్మెంట్ అవుతాను. మళ్లీ యాంకర్, వీడియో జాకీగా వ్యవహరించను. కావాలంటే ఏదైనా షోను హోస్ట్ చేయాలని అనుకొంటున్నాను అంటూ ఇటీవ‌ల చెప్పుకొచ్చింది శ్రీయా రెడ్డి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now