Sr NTR : తెలుగు సినీ పరిశ్రమకు ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లులా ఉండేవారు. వారి తర్వాత చిరంజీవి, బాలకృష్ణ తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో ఎంతో కృషి చేశారు. వీరిద్దరికి భీబత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా, వీరు చేసిన సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు వచ్చేవి. మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. ఈ పోటీలో ఈ రెండు సినిమాలు విజయాలు సాధించాయి. చిరంజీవి నటించిన `వాల్తేర్ వీరయ్య`, బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సాధించాయి.
అయితే ఇటీవల చిరంజీవి, బాలకృష్ణ గురించి వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు.నిర్మాత అశ్వినీ దత్ ఎన్టీఆర్, చిరంజీవి లతో ఎక్కువ సినిమాలు రూపొందించారు. చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్స్ రూపొందించారు.అలాగే బాలయ్యతో అశ్వమేధం చిత్రాన్ని రూపొందించారు. ఒకసారి ఓ చిత్ర షూటింగ్ విరామంలో ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య ముచ్చటించుకోగా, వారిద్దరి మధ్య వచ్చిన చర్చని తాజాగా అశ్వినీదత్ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య మాటల మధ్యలో చిరంజీవి నటించిన ఖైదీ, అడవి దొంగ, పసివాడి ప్రాణం లాంటి చిత్రాలు, అలాగే బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు, అనసూయమ్మ గారి అల్లుడు, మువ్వా గోపాలుడు లాంటి చిత్రాల విజయాల గురించి చర్చకు రాగా, సినీ పరిశ్రమ మీ అల్లుడు చిరంజీవి, మా కొడుకు బాలయ్యదేనని పెద్దాయన ఎన్టీఆర్ అల్లు రామలింగయ్యతో తరచూ అనేవారని… ఆ తర్వాత ఆ పెద్దాయన చెప్పినట్టుగానే ఆ ఇద్దరు హీరోలు అనేక సినిమా విజయాలతో సినీ పరిశ్రమలో స్టార్స్ గా ఎదిగారని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సి. అశ్విని దత్ తెలియజేశారు. ఆరుపదుత వయస్సులోను ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీని దున్నేయడం విశేషం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…