Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య థియేటర్స్ లో ఎంత సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో సంక్రాంతి వేదికైంది. చిత్రంలో వింటేజ్ చిరును చూసి అభిమానులు మురిపోయారు. మెగాస్టార్ యాక్షన్, కిక్కిచ్చే డ్యాన్సులు, విజిల్స్ వేయించే ఫైట్స్ ఇలా సినిమా మొత్తం ఒక మాస్ ప్యాకేజితో నిండిపోయింది. చిరు మాస్ యాక్షన్‌కు రవితేజ క్రేజ్ తోడవడంతో బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య విజయభేరి మొగించింది అని చెప్పాలి.
ప్రస్తుతం స్టడీగా కలెక్షన్స్ కొనసాగుతున్నాయి. వాల్తేరు వీరయ్య ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. దాదాపు అన్నీ ఏరియాల్లో మంచి వసూళ్లను సాధించి పెట్టిందీ చిత్రం. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదలైంది. ఫస్ట్ డే మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో టూ మిలియన్ మార్కును అధిగమించింది దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం.
ఇంతకు ముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి ఇతర సినిమాలు చూస్తే సైరా, ఖైదీ నెంబర్ 150లుగా ఉన్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా అక్కడ 2.5 మిలియన్ డాలర్స్‌ను ఇప్పటి వరకు అందుకుంది.. రీసెంట్ గా ఈ చిత్రం 25 రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఫిబ్రవరి 27 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, ఈ నెల 27 నుండి ఓటీటీలో రచ్చ షురూ కానుంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…