వినోదం

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న. Photo Credit: Rashmika Mandanna/Instagram.

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఉన్న‌ ఐటీసీ మెమొంటోస్ హోటల్ ప్యాలెస్‌లో వీరి వివాహం క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తోపాటు సినీ సెల‌బ్రిటీలు వీరి వివాహానికి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రులను ఆశీర్వ‌దించారు. అయితే వీరి వివాహం జ‌రుగుతుంద‌ని పెళ్లి కార్డు ద్వారా అంద‌రికీ తెలుసు. కానీ గురువారం సాయంత్రం వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ లేదు. అధికారికంగా ప్ర‌క‌ట‌న‌, ఫొటోలు విడుద‌ల కాలేదు. కానీ సాయంత్రం స‌మ‌యంలో ర‌ష్మిక మంద‌న్న త‌మ పెళ్లి జరిగిన‌ట్లు అధికారికంగా తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో త‌మ పెళ్లి ఫొటోల‌ను షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారాయి. ఇక అభిమానులు నూత‌న వ‌ధూవ‌రుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పెళ్లి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా వీరి వివాహం రెండు ర‌కాలుగా జ‌రిగింది.

రెండు ప‌ద్ధ‌తుల్లో వివాహం..

గురువారం ఉద‌యం 10:10 గంట‌ల‌కు తెలంగాణ సంప్ర‌దాయ హిందూ ప‌ద్ధ‌తిలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహం జ‌రిగింది. విజ‌య్ తెలంగాణ వాసి క‌నుక ఆ సంప్ర‌దాయంలో పెళ్లి చేసుకున్నారు. ఇక సాయంత్రం 4:30 గంట‌ల‌కు కొడ‌గు ప‌ద్ధ‌తిలో వీరి వివాహం మ‌ళ్లీ జ‌రిగింది. ర‌ష్మిక స్వస్థ‌లం క‌ర్ణాట‌క‌లోని కూర్గ్ (కొడగు) కాగా ఆ సంప్ర‌దాయం ప్ర‌కారం సాయంత్రం వివాహం చేసుకున్నారు. కాగా అభిమానులు వీరికి ఇప్ప‌టికే VIROSHI అనే పేరు పెట్ట‌గా ప్ర‌స్తుతం ఈ పేరిట సోష‌ల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.

ఫొటోలు ఆల‌స్యం..

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న చాలా కాలం కింద‌టి నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ వీరి ప్రేమ గురించి వీరు ఎన్న‌డూ అధికారికంగా చెప్ప‌లేదు. ప‌లు మార్లు విదేశీ టూర్ల‌కు కూడా వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇటీవ‌ల పెళ్లి చేసుకుంటున్నామ‌ని వారు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కానీ పెళ్లికి మీడియాకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అందువ‌ల్ల వీరి వివాహం ఉద‌యం జ‌రిగినా సాయంత్రం వ‌ర‌కు ఫొటోలు రాలేదు. ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు వీరి వివాహ ప్ర‌సార కార్య‌క్ర‌మ హ‌క్కుల‌ను ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీనిపై స్ప‌ష్ట‌త లేదు. అయితే ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో అభిమానులు వీరిని శుభాకాంక్ష‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM