పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ వార్త సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు గాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కింద ఏకంగా రూ.80 కోట్లను చెల్లించేందుకు సిద్ధమైందని సమాచారం. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందుకనే ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ కూడా భారీ ధర ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు గాను డిజిటల్ హక్కుల కోసం భారీగా చెల్లించేందుకు ముందుకు వచ్చిందని తెలుస్తుండగా, ఇది నిజం అయితే తెలుగు సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీల్స్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు అటు నెట్‌ఫ్లిక్స్ లేదా ఇటు చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ త్వరలో వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక థియేటర్ హక్కులు, డిజటల్ హక్కులు అన్నీ కలిపి ఈ సినిమాకు రూ.140 కోట్ల మేర బిజినెస్ జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా గతంలో పవన్ నటించిన ఓజీ సినిమాకు కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తంలో చెల్లించి డిజిటల్ రైట్స్‌ను తీసుకుంది. అందుకనే ఆ సంస్థ మళ్లీ పవన్ మూవీపై ఆసక్తిని చూపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాకు భారీగా బిజినెస్ జరుగుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర థియేట్రికల్ హక్కులకు గాను నిర్మాతలు రూ.70 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. పవన్ – హరీష్ కాంబోపై ఉన్న నమ్మకంతోనే వారు అలా అడిగినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ డీల్స్ అన్నీ ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉండగా త్వరలోనే వీటిపై అధికారిక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…