Vijay And Mahesh Babu : ఏంటి.. విజ‌య్‌, మ‌హేష్ బాబు ఒకే సినిమాలోనా..? బాక్సులు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే..!

November 22, 2023 9:06 AM

Vijay And Mahesh Babu : ఇటీవల కాలంలో సౌత్ సినిమాల స్థాయి పెర‌గింది. బాలీవుడ్‌తో పోటీ ప‌డి సినిమాలు చేస్తున్నారు. ఇక భాష తో సంబంధం లేకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలకు అయితే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతోంది. ఇక తమిళ హీరోలు ముందుగానే టాలీవుడ్ లో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. అయితే కొంద‌రు హీరోలు కొన్ని సినిమాల‌లో క‌లిసి న‌టిస్తే ప్రేక్ష‌కులకి ఎక్క‌డ‌లేని ఆనందం ద‌క్క‌డం ఖాయం. అది జ‌రిగితే బాగుండు అని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. సౌత్‌లో స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న మ‌హేష్‌,విజ‌య్ క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని ఎప్ప‌టి నుండో ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఈ ఇద్ద‌రు క‌లిసి న‌టించాల్సిన సినిమా జ‌స్ట్‌లో మిస్ అయింది. ఆ సినిమా ఏంటంటే పొన్నియిన్ సెల్వ‌న్. మహేష్, విజయ్ లను తన సినిమాలో నటింపజేసేందుకు మ‌ణిర‌త్నం ఎంత‌గానో ప్ర‌య‌త్నించాడ‌ట‌. వందియాదవన్, అరుణ్‌మొళి వర్మన్ పాత్రల కోసం మణిరత్నం ఈ ఇద్దరు స్టార్ హీరోలను మొదట అనుకున్నాడట. అయితే అరుణ్‌మొళి వర్మన్ పాత్ర కోసం మహేష్ బాబును, వల్లవరైయన్ వందియాదవన్ పాత్రకు దళపతి విజయ్ బాగుంద‌టుంద‌ని భావించి వారిని క‌లిసి విష‌యం చెప్ప‌గా వారు నో చెప్పార‌ట‌. ఇత‌ర సినిమాల‌కి క‌మిట్ కావ‌డం, వేరే కార‌ణాల వ‌ల‌న వారు నో చెప్ప‌డంతో ఈ పాత్రలను కార్తీ, జయం రవిలతో చేయించాల్సి వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ మూవీలో అరుణ్‌మొళి వర్మన్ (రాజ రాజ చోళ) పాత్రను జయం రవి, వందియాదవన్ పాత్రను కార్తీ పోషించారు.

Vijay And Mahesh Babu reportedly acting in one movie
Vijay And Mahesh Babu

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా రచయిత జయమోహన్ వెల్లడించడం విశేషం.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మెల్లగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు అతను నటించిన మాస్టర్ సినిమా తెలుగులో ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పది కోట్ల మార్కెట్ ఏర్పడడంతో ఆ మధ్య వచ్చిన సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. మ‌రోవైపు మ‌హేష్ బాబు పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now