Venkatesh Net Worth : సినిమా హీరో హీరోయిన్స్ కి సంబంధించిన ప్రతి అంశం వైరల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వాడే వస్తువుల నుంచి నివసించే ఇంటి వరకూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా విక్టరీ వెంకటేష్ ఇంటికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఆ ఇంటి ఖరీదు రూ.కోట్లలో ఉంటుందని అంచనా. మూవీ మొఘల్ దివంగత దగ్గుబాటి రామానాయుడు భారతదేశంలోని అన్ని భాషల్లో చిత్రాలు తీయడమే కాకుండా 100 చిత్రాలకు మించి నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేశారు. ఆయన వారసుడిగా వెంకటేష్ కలియుగ పాండవులు మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా తర్వాత విభిన్న పాత్రలతో క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ హిట్స్ అందుకుంటున్నాడు. ఇక రామానాయుడు పెద్ద కొడుకు డి.సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే తండ్రి వారసత్వంగా వెంకటేష్ కి స్థిర చరాస్తులు భారీగానే వచ్చాయని అంటున్నారు. మద్రాసు, హైదరాబాద్ లలో ఇళ్ళు ఇతడి వాటాగా వచ్చాయి.
సురేష్ బాబు, వెంకటేష్ ఇంకా మద్రాసు, హైదరాబాద్ లలోని ఆస్తులను పంచుకోలేదట. అయినప్పటికీ వారసత్వ ఆస్తులతోపాటు హీరోగా కూడా సంపాదించడం వలన ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు టాక్. మొత్తం మీద వెంకీ ఆస్తులు రూ.2,100 కోట్లకు పైమాటే అని అంటున్నారు. ఎందుకంటే ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా అందులో సక్సెస్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. కనుక వెంకీకి భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…