Vadhuvu OTT Web Series : ఓటీటీలోకి రాబోతున్న అవికా గోర్ వెబ్ సిరీస్.. ఎప్ప‌టి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!

November 13, 2023 10:49 AM

Vadhuvu OTT Web Series : చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ అవికా గోర్. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, తను నేను, ఎక్కడికి పోతావు చిన్న వాడా, రాజు గారి గది 3, టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌, థ్యాంక్యూ తదితర సినిమాలలో న‌టించి అల‌రించింది. అవికాకి మంచి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో పెద్ద గా సక్సెస్‌కాలేక‌పోయింది. మ‌ధ్య‌లో కొన్ని రోజులు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి కేవ‌లం సోష‌ళ్ మీడియాలతో పల‌క‌రించిన అవికా గోర్ ఇప్పుడు వెబ్ సిరీస్‌ల‌తో కూడా సంద‌డి చేస్తుంది.

ఇటీవలే మ్యాన్షన్ 24 అనే వెబ్‌ సిరీస్‍లో న‌టించిన అవికా త‌న న‌ట‌న‌తో అల‌రించింది. ఇక ఇప్పుడు అవికా మరో ఓటీటీ వెబ్ సిరీస్‌తో వస్తోంది. ప్రస్తుతం ఆమె న‌టిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘వ‌ధువు మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. కాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేక‌ర్స్ దీపావ‌ళి కానుక‌గా నేడు విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్ గ‌మనిస్తే ఇందులో అవికా గోర్ పెళ్లికూతురు గెట‌ప్‌లో ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లుగా క‌నిపిస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. సిరీస్‍లో బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ డిస్నీ+ హాట్‍స్టార్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఎప్పుటి నుండి స్ట్రీమింగ్ అవుతుంద‌నేది ప్ర‌క‌టించ‌లేదు.

Vadhuvu OTT Web Series to stream on disney plus hotstar
Vadhuvu OTT Web Series

చూస్తుంటే మ్యాన్షన్‌ 24 సిరీస్‌ లాగే వధువు కూడా థ్రిల్లర్‌ జోనర్‌కే చెందుతుందని తెలుస్తోంది.ఇప్పటికే దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న వధువు వెబ్‌ సిరీస్ ను ఎస్‍వీఎఫ్ సోషల్ పతాకంపై అభిషేక్ దాగా నిర్మిస్తున్నారు. కాగా పాప్‌ కార్న్‌ అనే తెలుగు సినిమాలో చివరిగా కనిపించింది అవికా గోర్‌. అలాగే నాగచైతన్య థ్యాంక్యూ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా క్లిక్‌ కాలేదు. దీంతో ఇప్పుడు ఎక్కువగా ఓటీటీ సినిమాలు, సిరీసుల్లోనే ఎక్కువగా న‌టిస్తూ త‌న స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంది అవికా గోర్. ఇవి అమ్మ‌డికి ఎంత‌గా క‌లిసి వ‌స్తాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now