Upasana : భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వాని. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన రెండో సినిమా చేసింది. ప్రస్తుతం తను బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే బీటౌన్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తను కొంతకాలంగా ప్రేమలో ఉండగా, ఎట్టకేలకి ఈ లవ్ బర్డ్స్ వివాహం మంగళవారం సాయంత్రం రాజస్థాన్‌లోని సూర్యఘడ్ కోటలో సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అఫిషియల్‌గా షేర్ చేసింది కియారా. ఈ సందర్భంగా రామ్ చరణ్ సిద్ధార్థ్, కియారా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందనే కోట్‌తో పాటు వారిద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న ఫొటోను జతచేస్తూ పోస్ట్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు రామ్ చరణ్. ఇక చరణ్ సతీమణి ఉపాసన… కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహ ఆల్బమ్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు ..‘అభినందనలు. మీ జంట చాలా అందంగా ఉంది. మేము హాజరుకానందుకు క్షమించండి. మీ ఇద్దరికీ ఎల్లప్పుడూ మా ప్రేమ ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్, ఉపాసన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
కియారా, సిద్ధార్థ్ పెళ్లి వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు వందకు పైగా వీవీఐపీలను ఇన్‌వైట్ చేసినట్లు సమాచారం. అలాగే తెలుగులో తనతో కలిసి పనిచేసిన ఇద్దరు నటులు రామ్ చరణ్, మహేష్ బాబులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిసింది. కియారా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ 15వ సినిమాలో నటిస్తోంది. ఇది రామ్ చరణ్‌తో తనకు రెండో సినిమా. ఈ మూవీకి సంబంధించిన ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. కియారా పెళ్లి కారణంగానే వాయిదా పడింది. ఇక సిద్, కియారా వివాహ వేడుకలన్నీ ముగిసిన తర్వాత రూ. 70 కోట్ల విలువైన తమ కొత్త జుహూ మాన్షన్‌కి మారనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…