Tripti Dimri : యానిమ‌ల్‌లో బోల్డ్‌గా న‌టించిన తృప్తి దిమ్రి అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుందా..?

December 15, 2023 5:37 PM

Tripti Dimri : ఎన్ని సినిమాలు చేసిన కూడా ద‌క్క‌ని గుర్తింపు కొంద‌రికి ఒకే ఒక్క సినిమాతో వ‌స్తుంది. అలా యానిమ‌ల్ సినిమాతో తృప్తి దిమ్రికి వ‌చ్చింది.రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’లో తృప్తి మెయిన్ హీరోయిన్ కాదు కాని సెకండ్ హీరోయిన్ పాత్రలోనే కనిపించింది. కానీ మెయిన్ హీరోయిన్‌గా నటించిన రష్మిక కంటే తృప్తి గురించే ఇప్పుడు అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. అందుకు కార‌ణం తృప్తి బోల్డ్ స‌న్నివేశాల‌లో అద్భుతంగా న‌టించ‌డ‌మే. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా చాలా బోల్డ్‌గా న‌టించింది. ఆమె చేసిన బోల్డ్ సీన్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. బెడ్‌పై నగ్నంగా ఇద్దరూ పడుకున్న సీన్ చూసి థియేటర్లలో ప్రేక్షకులు ఖంగు తిన్నారు.

బోల్డ్ సన్నివేశాలలో తృప్తి నటించడంతో రాత్రికి రాత్రే స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో తృప్తి జోయా పాత్రలో నటించారు. ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో తృప్తి టాప్ లో ఉండటం విశేషం. ‘యానిమల్’ సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు తృప్తిని ‘భాబీ 2’ అని పిలవడం మొదలుపెట్టారు. సినిమాలో తను పోషించిన జోయా అనే పాత్రకంటే భాబీ 2గానే ఆమెకు పేరు వ‌చ్చింది.. ఈ మూవీలో నటించడం కోసం తృప్తి రెమ్యునరేషన్ చాలా తక్కువ అని సమాచారం. ‘యానిమల్’లో జోయా పాత్ర కోసం తృప్తి కేవలం రూ.40 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్‌గా అందుకుందట. ఇది తెలుసుకొని అంద‌రు షాక్ అవుతున్నారు.

Tripti Dimri remuneration in animal movie
Tripti Dimri

యానిమ‌ల్ సినిమాలో చాలా హైలెట్ అయింది తృప్తినే. కాని ఈమె రెమ్యూనరేషన్ మాత్రం ఇంత తక్కువ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో నటించిన రష్మికకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందివ్వగా రణబీర్ కపూర్ కు 70 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక బాబీ డియోల్ ఈ సినిమా కోసం నాలుగు కోట్లు అనిల్ కపూర్ రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం యానిమ‌ల్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌డుతూ దూసుకుపోతుంది. వెయ్యి కోట్లు సులువుగా రాబ‌డుతుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now