Tiger Nageswara Rao OTT Release Date : అనుకున్న‌దానికంటే ముందుగానే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఓటీటీలో..!

November 10, 2023 4:11 PM

Tiger Nageswara Rao OTT Release Date : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ గ‌త కొద్ది రోజులుగా హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ రీసెంట్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఓమోస్త‌రు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ స‌తీమ‌ణి రేణూ దేశాయ్ కీల‌క పాత్రలో న‌టించింది. అయితే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌గా, చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ చిత్రాన్ని కాస్త ముందుగానే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

న‌వంబ‌ర్ లాస్ట్ వీక్‌లో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. నవంబర్ 24న ఈ బయోపిక్ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండ‌గా, ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దాదాపు 15 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. 1980 ద‌శ‌కంలో తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన గ‌జ‌దొంగ‌గా చెలామ‌ణి అయిన స్టూవ‌ర్ట్‌పురం నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా ఫిక్ష‌న‌ల్ బ‌యోపిక్‌గా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందింది. ఈ చిత్రంపై మొద‌టి నుండి భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Tiger Nageswara Rao OTT Release Date in telugu
Tiger Nageswara Rao OTT Release Date

ర‌వితేజ‌కి తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల‌లోను మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌డంతో ఈ సినిమాని భారీ అంచ‌నాల‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్ రిలీజ్ చేశారు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలో నుపూర్‌స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ హీరోయిన్లుగా న‌టించారు. రేణుదేశాయ్‌, అనుప‌మ్‌ఖేర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం రిలీజ్ ముందే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ర‌వితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా ఈ సినిమా చూద్దామ‌ని ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. రిలీజ్ త‌ర్వా త ఈమూవీ కొంద‌రికి న‌చ్చింది. మరి కొంద‌ర‌కి మాత్రం నిరాశ‌ని మిగిల్చింది. టైగ‌ర్ నాగేశ్వ‌రావు త‌ర్వాత ఈగ‌ల్ మూవీతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ర‌వితేజ‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now