The Road Movie OTT Release Date : ఓటీటీలో త్రిష లేటెస్ట్ మూవీ.. ఎందులో అంటే..?

November 11, 2023 9:38 PM

The Road Movie OTT Release Date : చెన్నై చంద్రం త్రిష ఒక‌ప్పుడు తెలుగులో వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రించింది. ఇప్పుడు మాత్రం తెలుగులో సినిమాలు త‌గ్గించి త‌మిళంలో మాత్రం వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. ఈ అమ్మ‌డి సినిమాలు మంచి విజ‌యాన్ని అందుకుంటున్నాయి. త్రిష కృష్ణన్ రీసెంట్‌గా నటించిన థ్రిల్లర్ మూవీ ది రోడ్. నెల రోజుల కింద థియేటర్లలో రిలీజై మంచి టాక్ కొట్టేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సంద‌డి చేస్తుంది. శుక్రవారం (నవంబర్‌ 10) అర్ధరాత్రి నుంచి ది రోడ్‌ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి రాగా, ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

త్రిష ఇటీవలి కాలంలో నటించిన పొన్నియన్ సెల్వన్1, 2, లియో చిత్రాలు మంచి విజయాలు సాధించ‌గా, ది రోడ్ కూడా త్రిష‌కి మంచి హిట్ అందించిపెట్టింది. ఈ థ్రిల్లర్ మూవీని అరుణ్ వశీగరన్ డైరెక్ట్ చేయ‌గా, అక్టోబర్ 10న థియేటర్లలో ఈ చిత్రం విడుద‌లైంది. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలో అడుగు పెట్టింది. ఓ హైవేపై ఒకే చోట వరుసగా ప్రమాదాలు జరుగుతుండటం వెనుక మిస్టరీని ఛేదించే అమ్మాయి పాత్రలో త్రిష నటించి మెప్పించింది. మొద‌టి నుంచి చివరి వరకు మంచి సీట్ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందింది. పదేపదే ఒకే ప్రాంతంలో యాక్సిడెంట్స్ జరగడం దాని వెనక రహస్యం తెలుసుకునే ప్రయత్నంగా ఈ సినిమా తెరకెక్కింది.

The Road Movie OTT Release Date
The Road Movie OTT Release Date

ది రోడ్ మూవీలో త్రిషతోపాటు షబ్బీర్, సంతోష్ ప్రతాప్, మియా జార్జ్, ఎమ్మెస్ భాస్కర్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఫేక్ యాక్సిడెంట్స్‌కు పాల్ప‌డుతూ ప్ర‌జ‌ల‌ను దోచుకుంటోన్న ఓ ముఠా గుట్టును సాధార‌ణ యువ‌తి ఎలా క‌నిపెట్టింది? త‌న భ‌ర్త‌, కొడుకు మ‌ర‌ణంపై ఏ విధంగా ప్ర‌తీకారం తీర్చుకున్న‌ద‌నే పాయింట్‌తో చిత్రం థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందింది. సింపుల్ స్టోరీని డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో కొత్త‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేసే ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now