The Great Indian Suicide Review : ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా శుక్రవారం ఆహా ఓటీటీ లో రిలీజ్ అయింది. రామ్‌కార్తిక్, హెబ్బా పటేల్ జంటగా ఈ సినిమాలో నటించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెర మీదకి తీసుకు వచ్చారు. విప్లవ్ కోనేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ ని థియేటర్ల లో రిలీజ్ చేయకుండా, డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఆహా లో శుక్రవారం ఆక్టోబర్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ముందు ఈ మూవీ కి టైటిల్ గా తెలిసిన వాళ్లు అని టైటిల్ పెట్టారు. ఆ తరవాత ది గ్రేట్ ఇండియన్ సూసైడ్‌గా పేరు మార్చి మూవీ ని తీసుకు వచ్చారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీసుకు వచ్చారు విప్లవ్ కోనేటి. ఇక కథ విషయానికి వస్తే.. హేమంత్ (రామ్‌కార్తిక్) అనాథ. స్నేహితుడితో కలిసి కాఫీ షాప్ ని నడుపుతుంటాడు. షాప్‌కు కుకీస్ సప్లై చేస్తుంటుంది చైత్ర (హేభాపటేల్). ఇలా వీళ్ళు లవ్ లో పడతారు.
హేమంత్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ చైత్ర మాత్రం అతనికి నో చెప్పేస్తుంది. కొద్ది రోజుల్లో కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంటామని చెప్తుంది. యాక్సిడెంట్ లో చనిపోయిన పెదనాన్న బళ్లారి నీలకంఠయ్యను (సీనియర్ నరేష్) ని తిరిగి బతికించడానికి ఆత్మ తర్పణం చేసుకుంటున్నామని ఆమె చెప్తుంది.
హేమంత్ అందరినీ సేవ్ చేయాలని అనుకుంటాడు. చైత్ర మెడ లో తాళి కట్టి ఆమె ఇంట్లో అడుగుపెడతాడు. చైత్ర కుటుంబాన్ని హేమంత్ ఎలా కాపాడతాడు..? కాపాడగలిగాడా లేదా.. ? వాళ్లంతా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది ఎవరు…? ఇదే కథ. ఆఖరికి ఏం అవుతుందో తెలియాలంటే సినిమా చూడాలి.
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…