జగపతి బాబు హీరోగా ఏ.ఎం.రత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పెద్దరికం మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది సుకన్య. ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత రాజశేఖర్ తో అమ్మ కొడుకు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. అయితే 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసిందనే చెప్పాలి. ఆ చిత్రంలో పెద్ద కమల్ హాసన్ సరసన.. వృద్ధురాలి పాత్రలో సుకన్య పలికించిన హావభావాలు అద్భుతం. దీంతో ఆ తర్వాత ఆమెకు తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఇక 2002లో శ్రీధరన్ రాజగోపాలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కానీ 2003 లోనే విడాకులు తీసుకుంది.
సినిమాల విషయంలో ఆమెకు ఎలాంటి వివాదాలు లేవు.. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రమే ఆమెకు ఆమె పెద్ద విలన్ అని చెప్పాలి. ఎంతటి విలన్ అంటే సినిమాల మీద ఉన్న పిచ్చితో ఏకంగా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకుంది. పెళ్ళయ్యాక కొన్నాళ్ళకు తమిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆనందం అనే సీరియల్ లో మెయిన్ లీడ్ కోసం అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆమె గర్భవతి. సుకన్య కెరీర్ పైన ఉన్న పిచ్చి ప్రేమతో భర్తకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంది. ఆ ఆతర్వాత అమెరికా నుంచి ఇండియా కూడా వచ్చేసింది. ఇక సీరియల్ లో నటించడం మొదలు పెట్టింది.
ఇక్కడితో ఆగితే సుకన్య జీవితంలో ఇంత పెద్ద వివాదం జరిగి ఉండేది కాదు. కానీ ఆనందం సీరియల్ మెగా సీరియల్ కావడంతో ఎక్కువ రోజులు ఇండియాలోనే ఉండాల్సి వచ్చింది. ఇదే అదనుగా భర్తపై వేధింపుల కేసు పెట్టి విడాకులు కోరింది. దాంతో నోటీసు అందుకున్న శ్రీధర్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. వెంటనే ఇండియాకి వచ్చిన శ్రీధర్ సుకన్య అబార్షన్ చేయించుకున్న విషయాన్నీ మీడియా ముందు పెట్టాడు. ఇక పెళ్లయిన ఏడాదిలోపే వారికి విడాకులు వచ్చాయి. ఆ తర్వాత సుకన్య ప్రాస్టిట్యూషన్ కేసులో రెండు, మూడుసార్లు చిక్కుకున్నట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…