Sudigali Sudheer : ర‌ష్మీతో పెళ్లిపై స్పందించిన సుడిగాలి సుధీర్

November 22, 2023 12:54 PM

Sudigali Sudheer : ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సుడిగాలి సుధీర్ ఎంతగా క‌ష్ట‌ప‌డ్డాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా అట్ట‌డుగు స్థాయి నుండి ఇప్పుడు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకునేంత వ‌రకు ఎదిగాడు. సుడిగాలి సుధీర్‌కు బయట ఎంతో క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై ఒకప్పుడు సుధీర్ లేకుండా షోలు, ఈవెంట్లు జరిగేవి కావు. కానీ ఇప్పుడు సుధీర్ తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే పెట్టేశాడు. ఈ క్ర‌మంలోనే సుధీర్ బుల్లితెరకు దూరమయ్యాడు. వెండితెరపై సక్సెస్‌లు కొట్టి హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్న సుధీర్ ఈ మ‌ధ్య కాలంలో గాలోడు అనే సినిమాతో మంచి హిట్ కొట్టాడు.

గాలోడు సినిమా హిట్ బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్సాఫీస్ వద్ద దర్శక నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది. గాలోడు హిట్‌తో ఇప్పుడు సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర అంటూ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి నిర్మిస్తుండగా.. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాకు అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ర‌ష్మీకి సుధీర్‌తో పెళ్లి గురించి ప్ర‌శ్న ఎదురైంది. అందుకు ఆయ‌న ఊహించ‌ని సమాధానం ఇచ్చాడు.

Sudigali Sudheer responded about marriage with rashmi gautam
Sudigali Sudheer

మాకు ఈ ప్ర‌శ్న ఎప్పుడు ఎద‌ర‌వుతూనే ఉంటుంది. మ‌మ్మ‌ల్ని జ‌నాలు చాలా ఓన్ చేసుకున్నారు. రష్మితో కెమిస్ట్రీ, వగైరా అంతా స్క్రీన్‌ కోసం చేసిందే అని చెప్పారు. పెళ్లి అనేది మన చేతుల్లో లేదని తెలిపారు. ప్రస్తుతానికి సినిమాలపైనే తన ఫోకస్‌ ఉందని, పెళ్లి గురించి ఇంకా ఆలోచించ‌డం లేద‌ని సుధీర్ స్ప‌ష్టం చేశారు. నాక‌స‌లు పెళ్లి చేసుకోవాల‌ని కూడా లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతం తాను కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్టు చెప్పారు. పొరపాటున ఏమైనా అయితే ఏం చేయలేనని తెలిపారు. తాను పెళ్లే చేసుకోను, పెళ్లే ఇష్టం లేదు, ఇప్పుడు కంఫర్ట్ గా ఉన్నానని చెప్పడంతో అభిమానుల గుండెలు ప‌గిలినంత ప‌నైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now