వినోదం

Hunt Movie : సుధీర్ బాబు కొత్త‌ సినిమా.. రిలీజైన 15 రోజుల‌కే ఓటీటీలో.. స్ట్రీమింగ్ అవుతున్న మూవీ..!

Hunt Movie : మ‌హేష్ బావ‌గా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు అనుకున్నంత రాణించ‌లేక‌పోతున్నాడు. ప్ర‌తి సినిమా కోసం ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టి సినిమాలు చేస్తున్న సుధీర్ బాబుకి ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి. సుధీర్ బాబు నటించిన హంట్ మూవీ గత గురువారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. హంట్ మూవీ ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఇంత తొంద‌ర‌గా ఈ చిత్రం ఓటీటీలోకి తీసుకొస్తుండ‌డంపై అంద‌రు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ హంట్‌లో సుధీర్ తోపాటు శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ నటించారు. పాత్ర‌ల ప‌రంగా వైవిధ్య‌త‌కు ప్రాధాన్య‌మిచ్చే సుధీర్ బాబు మ‌రోసారి కొత్త‌ద‌నాన్ని న‌మ్మి ఈ సినిమా చేశారు. ఇలాంటి రోల్ చేయాలంటే కాస్తంత ధైర్యం కావాల్సిందే. పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌కు అత‌డి లుక్‌, ఫిజిక్ చ‌క్క‌గా కుదిరాయి. పోలీస్ క‌మీష‌న‌ర్‌గా శ్రీకాంత్ న‌ట‌న ఎంతో బాగుంది. మ‌రో ఇంపార్టెంట్ రోల్‌లో ప్రేమిస్తే భ‌ర‌త్ క‌నిపించాడు. ఈ ముగ్గురి చుట్టే క‌థ ఎక్కువ‌గా న‌డుస్తుంది. క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్ల‌ర్స్‌లో కొత్త కోణాన్ని ట‌చ్ చేస్తూ రూపొందిన సినిమాగా దీనిని చిత్రీక‌రించారు.

Hunt Movie

మలయాళ సినిమా ముంబై పోలీస్ ఆధారంగా హంట్ సినిమాను తెరకెక్కించారు. గ‌తాన్ని మ‌ర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ ఇది. తాను సాల్వ్ చేసిన ఓ కేసును గ‌తాన్ని మ‌ర్చిపోవ‌డం వ‌లన తిరిగి ఫ‌స్ట్ నుంచి ఎలా టేకాఫ్ చేశాడ‌నే పాయింట్‌తో ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు మ‌హేష్ ఈ సినిమాను ఎంతో ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు.. సింపుల్ పాయింట్‌ను డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేసే ప్ర‌య‌త్నం చేసిన ప్రేక్ష‌కుల‌ని ఎంతో అల‌రించ‌లేక‌పోయింది.. సినిమా మొత్తం అర్జున్ ప్ర‌జెంట్‌, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో సాగుతుంది. ఇన్వెస్టిగేష‌న్ అంశాలు బాగున్నా వాటిలో వేగం పెరిగితే బాగుండేదని కొంద‌రు చెప్పుకొచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM