SS Rajamouli : రాజ‌మౌళి.. మ‌హేష్ బాబుని టార్చ‌ర్ పెట్టడం మొద‌లు పెట్టేశాడా..!

November 26, 2023 7:43 PM

SS Rajamouli : ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన జ‌క్క‌న్న త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌నున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారంస‌ షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెల చివరికి పూర్తి చేసేయ్యాలని మహేష్ బాబు చాలా క్లియర్ గా వున్నాడు, అందుకే ఈ సినిమాకి ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు అని తెలిసింది.

గుంటూరు కారం త‌ర్వాత మ‌హేష్ బాబు.. రాజ‌మౌళితో సినిమా చేయ‌నున్నాడు. సాధార‌ణంగా రాజ‌మౌళి ఏ సినిమా అవుట్‌పుట్ విష‌యంలో వెనక్కు తగ్గరు . ఎంత లేట్ అయినా ఫర్వాలేదు గానీ అనుకున్న అవుట్‌పుట్ వచ్చేదాకా అస్సలు వదిలిపెట్టరు. నటీనటులతో తనకు కావాల్సిన విధంగా ఫైనల్ ప్రింట్ తీసుకుంటారు జక్కన్న. ఇకపోతే నటీనటులు సినిమాకు మేజర్ హైలైట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడం రాజమౌళి సక్సెస్ మంత్ర. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా కోసం దిమ్మతిరిగే స్కెచ్ వేసుకొని బాలీవుడ్ సహా హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతున్నారట. అయితే మ‌హేష్ విష‌యంలో రాజ‌మౌళి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

SS Rajamouli putting conditions to mahesh babu
SS Rajamouli

రోజుకి 8 గంటలు జిమ్ చేస్తూ ఆహార డైట్ కూడా ఫాలో అవ్వాల‌ని రాజ‌మౌళి.. మ‌హేష్ బాబుకి సూచించార‌ట‌. ప్ర‌స్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్న మహేశ్ బాబుకు రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారింద‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంది. రెండు సినిమాల‌కి ఒకే స‌మ‌యంలో మ‌హేష్ బాబు ఇలా క‌ష్ట‌ప‌డుతుండ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా ఏ జానర్‌లో ఉండబోతోందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసిన రాజమౌళి.. అందుకు తగ్గట్లుగా ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారట. యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ దిగ్గజాలు భాగమయ్యేలా చేసుకుంటున్నారట. ఈ విషయాలను స్వయంగా రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now