తెలుగు సినిమా ప్రేక్షకులకు స్టార్ హీరో శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అప్పట్లో ఎన్నో చిత్రాల్లో నటించి తన సత్తా చాటారు. అద్భుతమైన యాక్టింగ్ ఈయన సొంతం. సోగ్గాడు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శోభన్ బాబే. ఈయన తన స్టైల్‌తోనూ ఎంతో మందిని ఆకట్టుకున్నారు. అప్పట్లో అందమైన నటులు అనగానే మనకు శోభన్ బాబు పేరే ముందుగా గుర్తుకు వస్తుంది. ఇక శోభన్ బాబు అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలను చేశారు. దీంతో ఆయనకు మహిళా ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్పవచ్చు.
విలక్షణమైన నటన ఆయన సొంతం. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అయితే వయస్సు పైబడ్డాక ఆయన ఇక సినిమాలకు దూరమవుతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. తన కుటుంబం నుంచి కూడా ఎవరినీ సినిమా రంగంలోకి వెళ్లనివ్వలేదు. అయితే హీరోగా నటిస్తున్న సమయంలోనే ఆయన తన సంపాదనతో ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. ముఖ్యంగా భూములను బాగా కొన్నారు. దీంతో ఆయన పిల్లలకు డబ్బుకు కొదువ లేకుండా పోయింది. అందుకనే పిల్లల్ని సగం సినిమాలకు దూరం చేశారని అంటారు. ఇక అప్పట్లో ఏ హీరోకు లేని ఆస్తి శోభన్ బాబుకు ఉండేది.
ఇక చెన్నైలో ఆస్తులను కూడబెట్టిన శోభన్ బాబు సినిమాలకు దూరం అయ్యాక అక్కడే సెటిలయ్యారు. ఫ్యామిలీతో అక్కడే ఉంటున్నారు. సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చాక తన మాటకు తాను కట్టుబడ్డారు. ఎన్నో సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సుస్వాగతం సినిమాకు మంచి పేరు వచ్చింది. అందులో పవన్ తో పాటు అతడి తండ్రిగా రఘువరన్ నటనకు కూడా మంచి స్పందన వచ్చింది. అయితే రఘువరన్ పాత్రకోసం శోభన్ బాబుకి ఛాన్స్ వచ్చినా వదిలేశారు. అంతేకాదు అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం అడిగితే కాదన్నారట. అలా మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ ను వదిలేసుకున్నారు. అయితే సినిమా రంగం అంటే ఉన్న అయిష్టత వల్లనే శోభన్ బాబు తన మాటకు కట్టుబడి ఇక సినిమాలు చేయలేదని అర్థం చేసుకోవచ్చు. అదే ఆయన మళ్లీ సినిమాల్లో నటించి ఉంటే ఆ రేంజ్ వేరేగా ఉండేది. ఆయనను చూసేందుకే సినిమాలకు వచ్చేవారని కచ్చితంగా చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…