Shruti Haasan : టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్ సెట్.. అడివి శేష్‌తో సుప్రిత చేయ‌నున్న సినిమాలో శృతి

December 13, 2023 5:58 PM

Shruti Haasan : టాలీవుడ్లో కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. యంగ్ హీరో అడివిశేష్ అక్కినేని వారి ఇంటి అమ్మాయి.. కింగ్ నాగార్జున మేనకోడలు, హీరో సుమంత్ సొదరి సుప్రియని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. గత కొంత కాలంగా అడివి శేష్, సుప్రియ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వీరు సహజీవనం కూడా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇండస్ట్రీలో విరిపై రకరకాల పుకార్లు షికారు చేశాయి. అయితే ఎప్పడు ఈ విషయంలో స్పందించలేదు ఇద్దరు స్టార్లు. కాకపోతే మీడియా వీరిపై ఎప్పుడూ కన్నేసి ఉంచింది. ఆమధ్య ఇద్దరు ఈ ఏడాది పెళ్లి చేసుకోబొతుననట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కొంత కాలానికి అవి సర్ధుమనిగాయి.

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కు స్పెషల్ ఇమేజ్ ఉండ‌గా, అత‌ను మంచి క‌థా బ‌లం ఉన్న సినిమాలు చేసుకుంటూ క్రేజ్ పెంచుకుంటున్నాడు. శేష్‌.. సుప్రియ‌తో క‌లిసి గూడాఛారి సినిమా చేయ‌గా, ఇది పెద్ద విజ‌యం సాధించింది. అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ అడివి శేష్ హీరోగా ఓ చిత్రం ప్రొడ్యూస్ చేయనున్నారు. చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్, సెవెన్ ఎకర్స్ స్టూడియోస్, ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలు ఆమె చూసుకుంటున్నారు. సోదరుడు సుమంత్ నటించిన సినిమాలకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించారు. అయితే… పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మీద సుప్రియ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత.

Shruti Haasan to act in adivi sesh next movie
Shruti Haasan

అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ క‌థానాయిక‌.ఈ సినిమాకు అమెరికాలో జన్మించిన, అక్కడ పెరిగిన షానియల్ డియో దర్శకత్వం వహిస్తారు. అయితే… తెలుగుకు ఆయన కొత్త కాదు. ఆల్రెడీ అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు కెమెరా వర్క్ అందించారు. ఇప్పుడీ సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అవుతున్నారు. ఈ సినిమా టైటిల్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుంద‌నేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now