Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రీసెంట్‌గా యానిమల్ చిత్రంతో దేశ ప్రేక్షకులందరిని అలరించాడు. యానిమల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, తృప్తి డిమ్రీ పాత్రలకు విశేష ఆదరణ దక్కుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. గీతాంజలి పాత్ర ద్వారా అందం, ఫెర్ఫార్మెన్స్‌తో హీరోయిన్‌గా మరో మెట్టు ఎక్కిందనే కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న భారీగా విడుదలైంది. ప్రచార చిత్రాలతో ఓ రేంజ్‌లో అంచనాలను పెంచిన ఈ సినిమా మొదట కాస్తా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది.
కొందరు సినిమా కాస్తా లెంగ్తీగా ఉందని విమర్శించగా.. మరికొందరు మాత్రం ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ సీన్స్, పాటలు ఇలా బాగున్నాయని.. రణబీర్ తన నటనతో అదరగొట్టారని రివ్యూలు ఇచ్చారు. అయితే ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అందరు చెప్పుకొస్తున్నారు. అసలు సినిమాని ఓ రేంజ్‌లో తీసావంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఆ విజువల్స్, ఆ టేకింగ్, ఆ మ్యూజిక్.. సూపర్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రూ.600కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మరికొద్ది రోజులలో వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు.
యానిమల్ సినిమా రెస్పాన్స్ చూసి దర్శకుడు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిత్రంపై మరింత హైప్ పెంచేందుకు ప్రమోషన్స్ చేస్తున్నారు. మూవీ ప్రచారం కోసం ఆయన ప్రస్తుతం అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే ఓ మూవీ చేయాలని ఉందని అన్నారు. చిరూతో యాక్షన్ డ్రామా సినిమా చేసేందుకు ఇష్టపడతానని తెలిపారు. తనకు చిరంజీవి ఇష్టమని గతంలో కూడా సందీప్ వెల్లడించగా, ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇక యానిమల్ సినిమా.. మహిళలపై ద్వేషం, హింసను ప్రేరేపించేలా ఉందని కొందరు కామెంట్ చేస్తుండగా, దానిపై పరోక్షంగా స్పందించిన సందీప్.. సినిమాని సినిమా మాదిరిగా చూడాలని అన్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…