Samantha : అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంత పలు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమె ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా విడాకుల విషయం ప్రకటించిందో అప్పటి నుండి సమంతపై ట్రోల్స్ వస్తున్నాయి. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్.. మొదటిసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించిన విషయం తెలిసిందే.
విడిపోయిన సమయంలో తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యానని, చనిపోవాలనుకున్నానని ఆమె అన్నారు. 2021.. తనకి వ్యక్తిగతంగా కలిసి రాలేదని ఆమె తెలిపారు. తాజాగా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకకు హాజరైన ఆమె.. ‘ఈటైమ్స్’తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై స్పందించింది.
విడాకుల విషయం గురించి చెప్పదలచుకున్నదంతా చెప్పేశాను. ఎందరో ఎన్నో అనుకున్నారని, అప్పుడే దానిపై మాట్లాడాలని భావించి మాట్లాడేశానని తెలిపింది. కాబట్టి మళ్లీ మళ్లీ దాని గురించే మాట్లాడాలనుకోవట్లేదని ఆమె తేల్చి చెప్పింది. ఆ విషయం మరోసారి అడగొద్దంటూ సమంత సున్నితంగా హెచ్చరించినట్టు కూడా తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2లోని బోల్డ్ సీన్స్ పైనా ఆమె మాట్లాడింది. సిరీస్ రిలీజ్ కాకముందు ఎన్నో అనుకున్నారని, కానీ, అది విడుదలయ్యాక అందరికీ తెలిసొచ్చిందని చెప్పింది. స్వేచ్ఛా జీవిగా ఉండే పాత్ర అని తెలిపింది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…