Salaar OTT Release Date : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకే బొమ్మ పడింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుందీ భారీ బడ్జెట్ మూవీ. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.
రికార్డు స్థాయిలో రూ.100 కోట్లకు సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ఫిబ్రవరి తొలి లేదా రెండో వారం నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. థియేటర్‌లలోకి ప్రవేశించిన సుమారు 45 నుండి 60 రోజుల తర్వాత బహుళ భాషలలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.. అయితే, మేకర్స్ నుండి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఇక ఈ మూవీలో ప్రభాస్ దేవా/సలార్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ పాత్రలో, జగపతి బాబు రాజమన్నార్‌గా, శృతి హాసన్ ఆద్యగా నటించి అలరించారు.
సలార్ చిత్రంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో సహా పలు భాషల్లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద షారూఖ్ ఖాన్ ‘డుంకీ’తో సాలార్ పోటీ పడుతోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ దేశీయంగా రూ. 95 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్లను తొలి రోజునే వసూలు చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విలువైన రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ డిజిటల్ హక్కులను తీసుకుంది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో లాభాలను ఇవ్వలేదు. కొనుగోలు విషయంలో ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నష్టపోయిందనేది ట్రేడ్ టాక్. ఇప్పుడు ఆ నష్టాన్ని సలార్‌తో తీసర్చుకోనుందని సమాచారం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…