Sai Dharam Tej : నారా లోకేష్‌ని క‌లిసి చెక్ అందించిన సాయిధ‌ర‌మ్ తేజ్

January 15, 2026 9:13 PM

Sai Dharam Tej : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీసెంట్‌గా సంభవించిన ఏపీ, తెలంగాణ వరదలకు ఎంతో మంది బాధితులుగా నిలిచారు. వారిని ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలంతా ముందుకు వచ్చి విరాళాలు అందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి దుర్గతేజ్, వరుణ్ తేజ్, నిహారిక.. ఇలా అందరూ తమ వంతుగా సాయం ప్రకటించారు.హీరో సాయి తేజ్ రూ.10 లక్షల విరాళం ప్రకటించగా.. ఆ చెక్ ను తాజాగా నారా లోకేశ్ కు అందించారు.

ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ ను మంత్రి లోకేశ్ అభినందించారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సాయి తేజ్ దర్శించుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని ఆమ్మ ప్రేమ ఆరాధన వృద్ధాశ్రామానికి కూడా వెళ్లారు. ఆ వృద్ధాశ్రమానికి వెళతానని గతంలో ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని ఇప్పుడు నెరవేర్చారు సాయి తేజ్. అక్కడి వృద్ధులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. ఆ వృద్ధాశ్రమానికి రూ.5లక్షలను విరాళంగా ఇచ్చారు.అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్… చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు.

Sai Dharam Tej given cheque to nara lokesh for ap flood victims help
Sai Dharam Tej

మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి.మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న సాయి దుర్గతేజ్ భవిష్యత్‌లోనూ తనకు వీలైనంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తనవంతుగా అండగా నిలబడాలని భావిస్తున్నారు.ఇక ఈ మ‌ధ్య సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమాల స్పీడ్ కాస్త త‌గ్గించారు. యాక్సిడెంట్ త‌ర్వాత కాస్త ఒళ్లు చేయ‌డంతో ఇప్పుడు ఫిజిక్‌పై దృష్టి పెట్టారు. మ‌రి కొద్ది రోజుల‌లో వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now