Roja With Jabardasth Artists : జ‌బ‌ర్ధ‌స్త్ గ్యాంగ్‌తో రోజా సంద‌డి.. చాలా ఏళ్ల త‌ర్వాత వాళ్లంద‌రిని క‌లిసిందే..!

November 17, 2023 7:48 PM

Roja With Jabardasth Artists : సినీ న‌టి రోజా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోల‌తో క‌లిసి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు అందించిన రోజా వెండితెర‌పై మంచి వినోదం పంచింది. ఎంఎల్ఏగా ఉన్న‌ప్పుడు రోజా జ‌బ‌ర్ధ‌స్త్ వంటి షోల‌కి జ‌డ్జిగా ఉంది. మంత్రి అయిన త‌ర్వాత మంత్రి పూర్తిగా అన్ని షోల‌కి హాజ‌రైంది.ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రతి రోజూ ఒక గ్రామంలో పర్యటిస్తున్నారు. రాత్రి అక్కడే బస చేసి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. నగరి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన రోజా పల్లెనిద్ర చేస్తూ గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే రోజా జ‌బ‌ర్ధ‌స్త్ నుండి దూర‌మైన కూడా ఆ క‌మెడీయ‌న్స్‌తో కలిసి తెగ సంద‌డి చేస్తుంటుంది.

ఈరోజు రోజా పుట్టిన రోజు కావడంతో జబర్దస్త్ ఆర్టిస్టులంతా ఆమెను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలిపారు. ఆమెతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా సందర్శించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అందరూ గ్రూప్ ఫొటో దిగ‌గా, ఆ పిక్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతుంది. జ‌బ‌ర్ధ‌స్త్‌ని వీడి రోజా ఏడాది అయింది. సంవ‌త్సరం త‌ర్వాత రోజా మ‌ళ్లీ జ‌బ‌ర్ధ‌స్త్ న‌టీన‌టుల‌తో క‌లిసి కనిపించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక రోజా ఇన్విటేష‌న్‌లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, హైపర్ ఆది మాత్రం హాజరు కాలేదు.

Roja With Jabardasth Artists after so many days they visited
Roja With Jabardasth Artists

సుడిగాలి టీమ్ రోజాకు ఎంత స్పెషలో తెలిసిందే. వారిపై ఎంతలా ఫన్నీ కామెంట్స్ చేసినా, వారూ జోక్స్ వేసినా సరదగా తీసుకొని ప్రేక్షకులను అలరించారు. ఈ గ్రూప్ ఫొటోలో వారూ కూడా ఉండి ఉంటే బాగుండేది అని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.రోజాతో ఫొటో దిగిన వారిలో అదిరే అభి, గాలిపటాల సుధాకర్, అప్పరావు, ఇమ్మాన్యుయేల్, కెవ్వు కార్తీక్, తదితరులు ఉన్నారు. ఇక రోజా ప్ర‌స్తుతం మంత్రిగా కొన‌సాగుతూ సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించి ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చిన కూడా వారికి అండ‌గా నిలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now