Roja : త్రిష‌పై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసిన న‌టుడికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన మంత్రి రోజా

November 20, 2023 7:41 PM

Roja : విలన్ పాత్రలతో పాపుల‌రైన మన్సూర్ అలీ ఖాన్ రీసెంట్‌గా త్రిష‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. త్రిష‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కి గాను తమిళ పరిశ్రమ స‌హా త్రిష‌ అభిమానులు అత‌డిపై అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ”త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్‌రూమ్‌ సీన్‌ ఉంటుందని ఊహించాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లవచ్చని అనుకుంటే, కాశ్మీర్ షెడ్యూల్ సమయంలో ఈ కుర్రాళ్ళు త్రిషను సెట్స్‌లో కూడా నాకు చూపించలేదు” అని మ‌న్సూర్ చెత్త కామెంట్స్ చేశాడు.

అయితే మ‌న్సూర్ వ్యాఖ్య‌ల‌కి తీవ్రంగ స్పందించిన త్రిష‌.. క్రూరమైన ప్రవర్తన , త‌ప్పుడు మనస్తత్వం కలిగిన ఇలాంటి పాతత‌రం నటులలో కొందరు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణం. ఇలాంటి వారితో న‌టించనుందుకు సంతోషంగా ఫీలవుతున్నాన‌ని త్రిష పేర్కొంది. షనల్ కమీషన్ ఫర్ విమెన్ సభ్యురాలు ఖుష్బూ కూడా ఈ వివాదం పట్ల తీవ్రంగా స్పందించి తన పదవి ఇచ్చిన బాధ్యతను వాడుకుంటూ అతని మీద ఖచ్చితంగా చర్యలు ఉండేలా అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పి ఒకరకమైన హెచ్చరిక కూడా జరీ చేశారు. ఇక తాజాగా నటి, మంత్రి రోజా మన్సూర్ పై విరుచుకుపడింది. ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడే మగాళ్లపై కేసులు పెట్టి, చట్ట పరంగా తీవ్ర చర్యలు తీసుకోవాలి.

Roja strong comments on actor who commented on trisha
Roja

వారికి క‌ఠినమైన శిక్ష విధించాలి. లేకుంటే ఈ మగాళ్లు భయపడరు. నాపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, త్రిష, ఖుష్బూ పై కామెంట్స్ చేసిన మన్సూర్ కావచ్చు ఎవరైనా సరే కఠినమైన శిక్షలు ఉండేలా చ‌ట్టాలు తీసుకురావాలి. మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఎంత టార్గెట్ చేసిన కూడా రాజ‌కీయాల‌లో మా స‌త్తా చూపించాం. సామాన్య మహిళలని ఇలాంటి మగాళ్లు క‌లిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌డం క‌ష్టంగానే ఉంది అంటూ రోజా దారుణంగా కామెంట్ చేశారు. ఇంత జరిగినా సదరు వృద్ధనటుడికి ఏ కోశానా పశ్చాత్తాపం లేదు.. అతను రిలీజ్ చేసిన వివరణ ప్రెస్ నోట్ లో ఎక్కడ క్షమాపణ ప్రస్తావన కించిత్ కూడా లేదు. అత‌నికి క‌ఠినమైన శిక్ష వేయాలంటూ మూవీ ల‌వ‌ర్స్ డిమాండ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now