Rishab Shetty : కాంతార ప్రీక్వెల్ కోసం రిష‌బ్ శెట్టి ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్..!

December 1, 2023 11:16 AM

Rishab Shetty : కాంతార‌.. ఈ క‌న్న‌డ చిత్రం కొన్ని నెల‌ల క్రితం చిన్న సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించింది. సౌత్‌తో పాటు నార్త్‌లోను ఈ మూవీ ర‌చ్చ చేసింది. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కన్నడలో కంటే మిగతా భాషల్లోనే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ రాబ‌ట్టింది. కాంతార ఇంత పెద్ద విజ‌యం సాధించ‌డంతో మూవీకి ప్రీక్వెల్ రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. కాంతార ఛాప్టర్ 1న టీజర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఇందులో రిష‌బ్ లుక్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

కాంతార చిత్రంకి రిషబ్ న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటాడు. ఇప్పుడు ప్రీక్వెల్‌లో కూడా ఆయ‌నే న‌టిస్తూ తెర‌కెక్కించ‌నున్నాడు. ఇందుకు గాను కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టికి ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లు వసూలు చేసినా.. రిషబ్ శెట్టికి దక్కింది మాత్రం కేవలం రూ.4 కోట్లే. ఇప్పుడు ప్రీక్వెల్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన‌డంతో నిర్మాత‌లు కూడా అత‌నికి అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం. సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాల్లో వాటాగా ఓ 50 కోట్లు ఇస్తారని తెలుస్తోంది. అంటే దాదాపు ప్రభాస్ రేంజ్ లోనే రిషబ్ 100 కోట్ల వరకు వారితోషికం అందుకునే అవకాశం ఉంది.

Rishab Shetty taking remuneration for kantara 2 know that
Rishab Shetty

ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్ల కు పైగా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా జాక్ పాట్ కొట్టేశారు అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో గానే కాకుండా దర్శకుడిగా కూడా రిషబ్ శెట్టి సరైన న్యాయం చేయడంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. అయితే రిషబ్ శెట్టి ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అంతకుమించి అనేలా నిర్మించాలని అనుకుంటున్నాడు. హోంబల్ ప్రొడక్షన్ సెకండ్ పార్ట్ ను దాదాపు 200 నుంచి 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now