Rashmika: ర‌ష్మిక‌ది ఓవ‌ర్ యాక్టింగ్ అంటూ నెటిజ‌న్ కామెంట్.. నీదేంటి నానా అంటూ చుర‌క‌

December 17, 2021 11:29 AM

Rashmika : హీరోయిన్స్ పెట్టే సోషల్ మీడియా పోస్ట్ ల గురించి పిచ్చి పిచ్చి కామెంట్ లు చేస్తూ ఉంటారు కొంతమంది నెటిజెన్ లు. అయితే వీటికి సెలబ్రిటీలు పెద్దగా స్పందించరు. అలాంటి కామెంట్స్ పట్టించుకోకుండా వాళ్ళ పని వారు చేసుకుంటూ పోతారు. కానీ కోపం వస్తే మాత్రం ఆ కామెంట్ చేసిన వాడి తిక్క తీర్చేస్తారు. అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో జరిగింది.

Rashmika befitting reply to a netizen who told her that she is not a good actor

పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక ఒక ఇంటర్వ్యూ లో తను మాట్లాడిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో లో ” పుష్పలో సామి సామి పాట కోసం చాలా కష్టపడ్డాను, ఈ పాట అందరికీ నచ్చితే చాలు, నేను డైరెక్టర్ చెప్పినట్టు చేసుకు పోయాను ” అంటూ పుష్ప సినిమా గురించి మాట్లాడుకొచ్చింది రష్మిక.

రష్మిక పెట్టిన పోస్ట్ కి ఒక నెటిజెన్ అత్యుత్సాహం ప్రదర్శించి “అసలు దీన్ని సినిమాలోకి తీసుకోకుండా ఉండాల్సింది, ఇదీ దీని ఓవర్ యాక్టింగ్” అంటూ అమర్యాదగా కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కి రష్మిక ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “యాక్టింగ్ ఓ, ఓవర్ యాక్టింగ్ ఓ, నేను లైఫ్ లో ఏదో ఒకటి సాధించాను. నువ్వేం సాధించావు నాన్నా” అంటూ కౌంటర్ ఇచ్చింది రష్మిక. కాగా రష్మిక నటించిన పుష్ప మూవీ ఈ నెల 17న విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now