Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన నటనతో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు విభిన్న తరహా పాత్రలు చేసి మెప్పించాలనే తపన మెండుగా ఉంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మూవీ మగధీర. రెండు జన్మల ఇతివృత్తంతో కూడుకున్న ఈ మూవీని ఎస్ ఎస్ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించాడు. నటన, కామెడీ, కీరవాణి సాంగ్స్ ఇలా అన్నీ ఈ సినిమా అఖండ విజయానికి బాటలు వేసాయి. ఇక 2018లో సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో చెర్రీ అద్భుత నటన కనబరిచాడు. సమంత యాక్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అదిరాయి. రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మూవీగా రికార్డులకెక్కింది.
చరణ్ లో మాస్ ఎలిమెంట్స్ అధికంగా గల నాయక్ మూవీ ఫాన్స్ కి కొత్త అనుభూతిని ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ మూవీలో చెర్రీ డబుల్ రోల్ అలరించింది. అమలాపాల్, కాజల్ గ్లామర్, థమన్ సంగీతం కుదిరాయి. వివి వినాయక్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఎవడు మూవీ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రమాదంలో మరణించిన రామ్ చరణ్ ఫేస్ ను ప్రమాదంలో ఉన్న అల్లు అర్జున్ కి అమర్చి సరికొత్త ట్రీట్ మెంట్ ఇచ్చిన ఈ సినిమా 2014లో రిలీజై ఫాన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ వంశీ పైడిపల్లి మలిచారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఆకట్టుకున్నాయి. 2016లో సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ధ్రువ మూవీ కూడా అద్భుత కలెక్షన్స్ సాధించింది. అరవింద్ స్వామి విలన్ గా చేయడం మరో ఆకర్షణ. రూ.90 కోట్లు కలెక్ట్ చేసింది.
అలాగే రచ్చ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది. కొత్త తరహాలో డైరెక్టర్ సంపత్ నంది రూపొందించిన ఈ మూవీ 2012లో రిలీజయింది. తమన్నా హీరోయిన్ గా గ్లామర్ పండించింది. మణిశర్మ సాంగ్స్ కుదిరాయి. ఇక చరణ్ ఎంట్రీ ఇచ్చిన చిరుత మూవీ పూరి జగన్నాధ్ మార్క్ ని చూపించింది. 2008లో వచ్చిన ఈ మూవీ రిలీజ్ కి జరిగిన హంగామా ఏ సినిమాకు జరగలేదు. ఇక చరణ్ నటన, హీరోయిన్ అందాలు, అన్నీ అమరాయి. అలాగే ఈ మధ్యే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ సైతం చరణ్ కెరీర్‌లో టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. స్వశక్తినే నమ్ముకోవాలన్న కాన్సెప్ట్ చరణ్ నటనలో కనిపిస్తుంది. అందుకనే ఆయన మెగా పవర్ స్టార్ అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…