Rajnikanth : భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న ర‌జ‌నీకాంత్‌.. ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

November 5, 2023 5:28 PM

Rajnikanth : నటుడు రజనీకాంత్ ఎప్పటినుండో, సినిమాల్లో నటిస్తున్నారు. మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటున్నారు. అసలు ఆయన గురించి పరిచయమే చేయక్కర్లేదు. సూపర్ సార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో, మళ్ళీ ఓ లైన్లోకి వచ్చేసారు. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులని కొల్లగొట్టిన ఈ సినిమా, ఇంకొకసారి ఆయన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న తలైవా 171 సినిమా కోసం, ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని, వార్తలు కూడా వస్తున్నాయి.

ఆసియాలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న యాక్టర్ గా రజినీకాంత్ నిలవబోతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, రజనీ చేయబోయే సినిమా ఇది. ఇద్దరి అరుదైన కాంబినేషన్ కావడంతో, ఎక్స్పెక్టేషన్స్ ఓ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా మరొకసారి బాక్స్ ఆఫీస్ రికార్డులని తిరిగి రాయడం కచ్చితం అని, ఇప్పటికే అంతా అంటున్నారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 260 రూపాయల కోట్ల నుండి రూ.280 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Rajnikanth remuneration you will be surprised to know
Rajnikanth

నిజానికి ఇంత భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ రావడానికి ముందు, ఏరియా డిస్ట్రబ్బిషన్ హక్కులని తీసుకోవాల్సిందిగా, రజని ని అడిగారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. కమల్ హాసన్ తో విక్రమ్, విజయ్ తో లేవు బాక్సాఫీస్ దగ్గర సంచలనాన్ని క్రియేట్ చేయడంతో, రజనీతో ఒక లోకేష్ సినిమా అంతకుమించి తీసుకు రానున్నారు.

ఈ సినిమాపై ఉన్న అంచనాలని, క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ రెడీ అవుతుంటే, రెమ్యునెరేషన్ ని మరో లెవెల్ కి తీసుకువెళ్లారు రజని. ఇండియాలోనే కాదు ఏకంగా ఆసియాలోనే, అత్యంత మొత్తం అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. జైలర్ సినిమాకి రజనీకాంత్ 200 కోట్లకు పైగా వసూలు చేయడంతో, ఇండియాలోనే అత్యధిక మొత్తం అందుకున్న హీరోగా నిలిచారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now