Pushpa Movie : దుమ్ము లేపుతున్న పుష్ప ట్రైల‌ర్‌.. టాప్ ట్రెండింగ్‌లోకి..!

December 7, 2021 8:35 PM

Pushpa Movie : అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ పుష్ప‌. ఈ మూవీకి గాను ట్రైల‌ర్‌ను తాజాగా లాంచ్ చేశారు. అయితే ఈ ట్రైల‌ర్‌కు పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. విడుద‌లై కొన్ని గంట‌లు మాత్ర‌మే అవుతున్నా.. 1.47 కోట్ల‌కు పైగా వ్యూస్‌ను సాధించి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఈ ట్రైల‌ర్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Pushpa Movie trailer is amazing fans say that trending in youtube

పుష్ప మూవీని సుకుమార్ రెండు పార్ట్‌లుగా తెరకెక్కించారు. డిసెంబ‌ర్ 17న ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా.. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు, పోస్ట‌ర్స్ ఫ్యాన్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా ఈ మూవీలోని సునీల్‌, అన‌సూయ లుక్‌ల‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో వారు కూడా డీగ్లామ‌ర్ లుక్‌లో కనిపించారు. ఇక అన‌సూయ తాజా పోస్ట‌ర్‌లో సునీల్‌పైకి ఎక్కి నోట్లో బ్లేడు పెట్టుకుని ర‌చ్చ చేసింది. ఈ మూవీకి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించారు. మైత్రిమూవీ మేక‌ర్స్ నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now