Pushpa Deleted Scene : హీరోయిన్‌ రష్మిక ప్రైవేటు పార్ట్‌పై చేయి వేసిన అల్లు అర్జున్‌..? నెలకొన్న వివాదం.. సీన్‌ అందుకే తొలగించారట..?

December 19, 2021 1:55 PM

Pushpa Deleted Scene : అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ పుష్ప.. బాక్సాఫీస్‌ మీద దండయాత్ర చేస్తోంది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్‌ నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి.

Pushpa Deleted Scene this is the reason that scene removed from movie

పుష్ప మూవీలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్న నటించగా.. ఆమె క్యారెక్టర్‌కు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. ఇక ఇందులో సమంత సాంగ్‌కు విపరీతమైన క్రేజ్‌ లభిస్తోంది. అయితే ఈ మూవీలో ఓ సీన్‌ను కావాలనే తొలగించారని సమాచారం. ఇందుకు బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది.

పుష్ప మూవీ విడుదలైనప్పటి నుంచి ఈ మూవీని రకరకాల వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో ఓ సీన్‌ మరీ జుగుప్సాకరంగా ఉందని అంటున్నారు. ఇందులో కొన్ని సీన్స్‌ మరీ వెగటు పుట్టించేలా ఉన్నాయని అంటున్నారు.

ఈ మూవీలో వ్యాన్‌లో హీరో హీరోయిన్లు భుజం మీద చేతులు వేసే సీన్‌ మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇక హీరో అల్లు అర్జున్‌ హీరోయిన్‌ రష్మిక ప్రైవేటు పార్టుపై చేయి వేసినట్లు కనిపిస్తాడు. ఆమె చేయి తీయమని పలుమార్లు చెప్పినా డైవర్ట్‌ చేస్తూ అలాగే ఉంచుతాడు. దీంతో ఈ సీన్‌పై అందరూ విమర్శిస్తున్నారు.

సుకుమార్‌ తన కెరీర్‌లో ఇంతటి అసభ్యకరమైన సన్నివేశాలను ఇంత వరకు తీయలేదని చాలా మంది ఛీ కొడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం సుకుమార్‌ కు తెలిసిందట. దీంతో ఆ సీన్‌ను తొలగించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ సీన్‌ లేకుండానే ప్రస్తుతం మూవీని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now