Pushpa 1 Movie Review : పుష్ప ఫ‌స్ట్ పార్ట్ రివ్యూ.. మాంచి మసాలా మూవీ..!

December 17, 2021 9:15 AM

Pushpa 1 Moive Review : అల్లు అర్జున్ తొలి సారి పుష్ప అనే చిత్రంలో ప‌క్కా మాస్ అవ‌తారంలో న‌టించి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్నాడు. ఈ రోజు పుష్ప తొలి పార్ట్ విడుద‌ల కాగా, ఈ చిత్రం ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందింది. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప (అల్లు అర్జున్), అతి తక్కువ సమయంలోనే తన తెగువతో, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు.

Pushpa 1 Movie Review fantastic mass film

ఈ క్రమంలో అతన్ని అడ్డు పెట్టుకుని కోట్లు గడించిన కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్), అతని తమ్ముళ్ళకు ఎలా చుక్కలు చూపించాడు ? ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం శ్రీను (సునీల్)కు పక్కలో బల్లెంగా ఎలా మారాడు ? చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన తనను ఆ కారణంతో అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు ? అనేది చిత్ర క‌థ‌.

సినిమా ప్రారంభమైన మరుక్షణం నుండి ఆడియెన్స్ కు పుష్ప రాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు. బన్నీ పుష్ప పాత్రకు ఐకాన్ గా నిలిచాడు. మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లోనూ అంత వినోదాన్ని పండించాడు. శ్రీవల్లి పాత్రలో రష్మిక ఒదిగి పోయింది. ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్‌ ఘోష్‌, అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు.

ఈ మూవీలో స్పెషల్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ అంటే సునీల్ పోషించిన మంగళం శ్రీను పాత్ర. ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా సునీల్ సూపర్ గా యాక్ట్ చేశాడు. మంగళం శ్రీను భార్య దాక్షాయణిగా అనసూయ నటించింది. ఆమె మేకోవర్ కూడా డిఫరెంట్ గా ఉంది. స‌మంత స్పెష‌ల్ సాంగ్ కూడా ఈ సినిమాకి అస్సెట్ అయింది.

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ మీద మనవాళ్ళు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రావు రమేశ్ నటనను పూర్తి స్థాయిలో ఇందులో చూసే అవకాశం లేకుండా పోయింది. చంద్రబోస్‌ అందించిన పాటలు ఇటు సాహితీ కారుల్ని, అటు కుర్రకారుని ఆకట్టుకునే ఉన్నాయి. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ మూవీకి మరో హైలైట్. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీన్స్ గూజ్ బంప్స్ కలిగిస్తాయి. బన్నీ ఫ్యాన్స్ కు, యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘పుష్ప’ సూపర్ కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment