రాజా సాబ్ విడుదల సమయంలో ప్రభాస్‌పై పలు ప్రతికూల కథనాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని పాటలు, యాక్షన్ సన్నివేశాల్లో ఫేస్-స్వాప్ షాట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్ర విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలతో కొంతమంది అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. అయితే, మరికొందరు మాత్రం ఇవన్నీ సాంకేతిక లోపాలు లేదా దర్శకత్వ సంబంధిత నిర్ణయాల వల్ల వచ్చి ఉండొచ్చని, ముఖ్యంగా ప్రభాస్ ఆ సినిమా కోసం చేసిన విస్తృత షూటింగ్ డేస్‌ను దృష్టిలో పెట్టుకోవాలని వాదించారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్‌కు సంబంధించిన తాజా వార్త సోషల్ మీడియాలో చర్చ దిశను పూర్తిగా మార్చేసింది. తన కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్‌కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ ఘటనతో గతంలో వచ్చిన విమర్శలను అభిమానులు గట్టిగా ఖండిస్తున్నారు.
భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రభాస్ ఎంత శారీరక శ్రమ పడుతున్నాడో ఈ సంఘటనే నిదర్శనమని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో వచ్చిన విమర్శలు ఆయన అంకితభావాన్ని ఏమీ చేయలేకపోయానని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే, ఈ గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభాస్‌కు వచ్చినది చిన్న గాయమేనని, ఆయన త్వరలోనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా కోసం గుర్రపు స్వారీ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
రాజా సాబ్ పరాజయం తర్వాత ప్రభాస్ మీడియాకు దూరంగా ఉంటూ లో-ప్రొఫైల్‌ను కొనసాగిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫౌజీ, స్పిరిట్ సినిమాల షూటింగ్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత కొంత విరామం తీసుకుని బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వడమే ఆయన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ పూర్తిగా కోలుకున్నారని, మళ్లీ ఉత్సాహంగా పనిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్‌లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…