Prabhas Sreenu : నటుడు, కమెడియన్ ప్రభాస్ శ్రీను ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అయింది. ఇప్పటికే 300 పైగా సినిమాలు చేసిన శీను ఒక స్టార్ హీరో రేంజ్ ప్రభాస్ తో చాలా క్లోజ్ ఎలా అయ్యారు. ప్రభాస్‌పై ఇష్టంతో ప్రభాస్ శీనుగా మారారు. శ్రీను కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తయ్యాయి. ‘వర్షం’, ‘చక్రం’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘డార్లింగ్’, ‘పౌర్ణమి’ తదితర చిత్రాల్లో ప్రభాస్‌తో కలిసి నటించారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అయితే ఇటీవల ప్రభాస్‌కి, శీనుకి మధ్య విబేధాలు వచ్చినట్టు ప్రచారాలు సాగాయి.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీను. ఆయన ఏ విషయంలోనూ సలహా ఇవ్వరని, ‘నువ్వెంటో ముందు తెలుసుకో.. దానిని బట్టి ముందు అడుగు వెయ్యి’ అని మాత్రమే చెబుతారు’ అని అన్నారు. ఇద్దరి మధ్య దూరం పెరిగిందనీ, ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ శ్రీను స్పందించారు. మా మధ్య అలాంటిది ఏమీ లేదని , మా స్నేహం నదీ ప్రవాహంలా సాగుతుందని చెప్పారు. సాధారణంగా ప్రభాస్ ఎవరికి సలహా ఇవ్వరు. అలా చేస్తే భయంతో పనిచేస్తారని, అలా చేయడం సరైందికాదని ప్రభాస్ నాకు ఎక్కువగా చెబుతూ ఉంటారని శీను అన్నాడు.
ప్రభాస్‌కి నచ్చని చాలా అలవాట్లు మార్చుకున్నాం. మా స్నేహం నదీ ప్రవాహంలా సాగుతుంది. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేము వరుస సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాం. ఇతరుల మాట విని ప్రభాస్ మీపై కోప్పడిన సందర్భాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు తనకెప్పుడూ అలా అనిపించలేదని అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ శీను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన ‘సలార్ పార్ట్ 1’ డిసెంబరు 22న విడుదల కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇవి పూర్తయ్యాక సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…