Prabhas : ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్ర‌భాస్ భారీ విరాళం.. వామ్మో.. మ‌రీ అంత‌నా..?

December 7, 2021 1:30 PM

Prabhas : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల వ‌ర‌ద‌లు వ‌చ్చి భారీ ఎత్తున న‌ష్టం సంభ‌వించిన విష‌యం విదిత‌మే. ప్ర‌జలు వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. అయితే తాజాగా ప‌లువురు టాలీవుడ్ హీరోలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు. ఈ క్ర‌మంలోనే వారి స‌ర‌స‌న ప్ర‌భాస్ చేరిపోయాడు.

Prabhas donted rs 1 crore to andhra pradesh cm relief fund

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం అంద‌జేశాడు. ఏకంగా రూ.1 కోటిని విరాళంగా అందించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్‌టీఆర్‌, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ తేజ్, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ లు రూ.25 ల‌క్ష‌ల చొప్పున విరాళాలు అందించగా.. వీరంద‌రి క‌న్నా ప్ర‌భాస్ ఎక్కువ విరాళం అందించ‌డం విశేషం.

గ‌తంలోనూ ప్ర‌భాస్ ఇదేవిధంగా భారీ ఎత్తున విరాళాలు అంద‌జేశాడు. కోవిడ్ స‌మ‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఇచ్చాడు. త‌రువాత తెలంగాణ‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కు స‌హాయం చేశాడు. గ‌తంలో ఏపీలో వైజాగ్‌లో వ‌చ్చిన హుదుద్ తుఫాన్‌కు బాధితుల‌కు అండ‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలోనే భారీ మొత్తంలో మ‌రోమారు ప్ర‌భాస్ విరాళాన్ని అంద‌జేసి త‌న ఉదార‌త‌ను చాటుకున్నాడు.

ఇక ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. పూజా హెగ్డెతో క‌లిసి రాధే శ్యామ్ లో న‌టిస్తుండ‌గా.. ఈ మూవీ జ‌న‌వ‌రిలో విడుద‌ల కానుంది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో స‌లార్ అనే మూవీ చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now