వినోదం

చెన్నై నుంచి ముంబైకి విమానంలో భోజనం.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్!

ఆహారం పట్ల తనకున్న ఇష్టాన్ని పంచుకున్న ప్రభాస్. Photo Credit: UVCreations/Youtube.

హైద‌రాబాద్ బిర్యానీ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని స్టార్ హీరో ప్ర‌భాస్ అన్నారు. సంతోష్ శోభ‌న్‌, మాన‌సా వార‌ణాసి, క‌పుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో తాజాగా నిర్వహించిన ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ మాట్లాడారు. త‌న ఆహార‌పు అల‌వాట్ల‌తోపాటు గ‌తంలో ప‌లు సినిమాల షూటింగ్‌ల సంద‌ర్భంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఆదిపురుష్ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న గురించి ఆయ‌న వివ‌రించారు. ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు చీట్ డే గా ప్రకటించి, ఈ రోజు ఎవరూ భోజనం చేయకండి, నేను ప్రత్యేకంగా చెన్నై ఫుడ్ అరేంజ్ చేస్తున్నాను అని టీమ్‌కు చెప్పారు. అయితే ఎంత సేపు వెయిట్ చేసినా భోజ‌నం రాలేదు.

ఇంట‌ర్‌స్టేట్ ఫుడ్ డెలివ‌రీ..

గంటల తరబడి వేచి చూసినా భోజనం రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆలస్యం ఎందుకని అడిగితే, ప్ర‌భాస్ మాట్లాడుతూ, ఆహారం చెన్నై నుంచి వస్తోందని చెప్పడంతో అందరూ షాక‌య్యారు. ముంబైలోనే ఉన్న ఏదైనా తమిళ స్టైల్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి, చెన్నై నుంచి ఓ వ్యక్తి విమానం ఎక్కి, ప్రత్యేకంగా ఆహారం తీసుకొచ్చాడని తెలిసి టీమ్ మొత్తం ఆశ్చర్యపోయింది. ఈ ఇంటర్‌స్టేట్ ఫుడ్ డెలివరీని గుర్తు చేసుకుంటూ ప్రభాస్ నవ్వుతూ చెప్పారు. ఇక ప్ర‌భాస్ త‌న‌కు హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అలాగే చెన్నై బిర్యానీలో ఉండే కాస్త పుల్లని రుచులు తనకు ఇంకా బాగా నచ్చుతాయని కూడా వెల్లడించారు.

కాగా ప్ర‌భాస్ భోజ‌న ప్రియుడ‌న్న విషయం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న సినిమా షూటింగ్‌ల సమ‌యంలో ఇంటి నుంచే స్వ‌యంగా వంట‌కాల‌ను సిద్ధం చేసి మ‌రీ సెట్ల‌కు తీసుకు వ‌స్తుంటారు. ఈ విష‌యాన్ని గ‌తంలో ఎన్నో సార్లు స‌హ న‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు కూడా వెల్ల‌డించారు. ఆతిథ్యం ఇవ్వ‌డంలో ప్ర‌భాస్ త‌రువాతే ఎవ‌రైనా అని కూడా చెబుతుంటారు. అయితే తాజాగా ప్ర‌భాస్ చెప్పిన విష‌యాలు మ‌ళ్లీ ఆయ‌న అతిథి మ‌ర్యాద‌ల‌ను గుర్తు చేస్తున్నాయ‌ని ఫ్యాన్స్ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM