Pooja Hegde : పూజా హెగ్డెను చంపేస్తామ‌ని బెదిరించారా..? అస‌లు ఏం జ‌రిగింది..?

December 15, 2023 1:58 PM

Pooja Hegde : అల‌వైకుంఠ‌పురం చిత్రంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ‌ పూజా హేగ్దే.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని కైవ‌సం చేసుకున్న ఈ భామ ఒక‌ప్పుడు సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి అల‌రించింది. ప్ర‌స్తుతం పూజాకి తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్సు లేవు. కేవ‌లం ప‌లు హిందీ ప్రాజెక్టులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. పూజా బాలీవుడ్‌లో దేవా అనే సినిమాకు సైన్ చేసిన‌ట్లుగా స‌మాచారం. ఈ సినిమాలో షాహీద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ ప‌నులు చ‌క‌చ‌కా సాగిపోతున్నాయి. ఇక‌, ఈ సినిమాను 2024 దసరాకి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.

తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. పూజా హెగ్డేని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయట. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయిన వైరల్ భయాని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. పూజా హెగ్డే ఇటీవ‌ల దుబాయ్‏ కి వెళ్లడం జరిగింది. అప్పుడు ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్టు భయాని చెప్పుకొచ్చాడు. ఈవెంట్ మేనేజ‌ర్‌తో పూజా హెగ్డే గొడ‌వ ప‌డ‌గా, ఆ స‌మ‌యంలో టైంలో పూజా హెగ్డేని చంపేస్తామని కొందరు బెదిరించారట. ఈ క్రమంలో భయపడిపోయిన పూజా హెగ్డే ఇండియాకి వ‌చ్చేసింద‌ని అంటున్నారు.

Pooja Hegde incident in dubai what really happened there
Pooja Hegde

అయితే ఈ వార్త కేవ‌లం రూమ‌రేన‌ని కొంద‌రు అంటున్నారు. ఈ విష‌యంపై బీటౌన్ మీడియా న‌టి పూజ‌టీమ్‌ని సంప్ర‌దించ‌గా, ఈ వార్త‌లో ఎలాంటి నిజం లేద‌ని వారు చెప్పిన‌ట్లు బీటౌన్ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. అయితే, సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయిన ఆ పోస్ట్‌ను కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ న్యూస్ కేవ‌లం రూమ‌రే అని తేలిపోయింది. ఈ వార్త విన్న ఆమె అభిమానులు కాస్త ఊర‌ట ల‌భించింది. పూజా హెగ్డేకి ఇటీవ‌ల ప్లాప్ లు పెరగడంతో.. అవకాశాలుతగ్గుతూ వస్తున్నాయి. ఐరన్ లె్ గ‌ అన్న పేరు పడటంతో.. పూజాహెగ్డే సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తోంది. ఈక్రమంలో మహేష్ బాబుతో చేయబోయిన గుంటూరు కారం మూవీ నుంచి వెనక్క రావల్సి వచ్చింది. లైగర్ ఫెయిల్యూర్ తో.. విజయ్ దేవరకొండతో చేయాల్సి జనగనమణ సినిమా ఆగిపోయింది. ఆ రకంగా కూడా కలిసిరాలేదు బుట్ట‌బొమ్మ‌కి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now