వినోదం

విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?

విజయ్ దేవరకొండ – రష్మిక దంపతులకు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. Photo Credit: Rashmika Mandanna/Instagram.

ఈ నెల 26వ తేదీన రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌కు ప్ర‌ధాని మోదీ వివాహ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చాలా కాలంగా ఈ ఇద్ద‌రూ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే త‌మ పెళ్లి వ‌ర‌కు ఈ విష‌యాన్ని వారు అధికారికంగా చెప్ప‌లేదు. కానీ స‌డెన్‌గా ఇటీవ‌లే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు. ఈ వివాహ కార్య‌క్ర‌మానికి చిత్ర ప‌రిశ్ర‌మ‌తోపాటు ప‌లు ఇత‌ర రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖుల‌ను కూడా వీరు ఆహ్వానించారు. అందులో భాగంగానే ప్ర‌ధాని మోదీని కూడా త‌మ పెళ్లికి ఆహ్వానించారు. అయితే ఆయ‌న ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న నేప‌థ్యంలో నూత‌న వ‌ధూవ‌రుల‌కు లేఖ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ కార్యాల‌యం విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక మంద‌న్న దంప‌తుల‌కు ఓ లేఖ‌ను పంపించింది. అందులో ప్ర‌ధాని మోదీ స్వ‌యంగా సంత‌కం చేసి త‌న శుభాకాంక్ష‌లను తెలియ‌జేయ‌డం విశేషం.

ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు..

విజ‌య్ – ర‌ష్మిక‌ల వివాహ వేడుక‌కు నన్ను ఆహ్వానించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద‌క‌ర‌మైన, శుభ‌క‌ర‌మైన సంద‌ర్భంలో దేవ‌ర‌కొండ‌, మంద‌న్న కుటుంబాల‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.. అని మోదీ త‌న లేఖ‌లో తెలిపారు. విజ‌య్ – ర‌ష్మిక‌ల జీవితంలో ఇదొక కొత్త‌, అంద‌మైన అధ్యాయానికి ఆరంభం. స‌ఖాసప్త‌ప‌దా భ‌వ అనే స్ఫూర్తితో ఏడ‌డుగులు వేస్తున్న ఈ జంట జీవితాంతం స్నేహితులుగా క‌ల‌సి ఉండాల‌ని కోరుకుంటున్నా. ఉమ్మ‌డి క‌ల‌ల‌తో వాటిని నెర‌వేర్చుకుంటూ, రానున్న కాలం అంతా క‌ల‌సి మెలసి ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నా. ఒక‌రినొక‌రు అర్థం చేసుకుంటూ నిజ‌మైన భాగ‌స్వాములుగా వారి జీవిత ప్ర‌యాణం సాగాలి. ఈ ఆనంద స‌మ‌యంలో ఆ జంట‌తోపాటు వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా నా ఆశీస్సులు, శుభాకాంక్ష‌లు.. అని మోదీ త‌న లేఖ‌లో రాశారు. కాగా మోదీ రాసిన ఈ లేఖ ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

ఆ సినిమాతోనే ప్రేమ‌లో..?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ప‌లు చిత్రాల్లో క‌ల‌సి నటించారు. వీరు క‌ల‌సి యాక్ట్ చేసిన గీత గోవిందం మూవీ అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎక్కువ‌గా క‌నెక్ట్ అయింది. అయితే ఈ చిత్రం త‌రువాత‌నే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌రువాత వీరు మీడియా కంట ప‌డ‌కుండా ప‌లు సార్లు మాల్దీవ్స్ వంటి దేశాల‌కు ట్రిప్పులు కూడా వేసి వ‌చ్చార‌ని అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి. ఇక ప‌లు సంద‌ర్భాల్లో వీరి రిలేస‌న్‌షిప్‌పై కొంద‌రు సెల‌బ్రిటీలు బ‌హిరంంగానే వీరికి ప్ర‌శ్న‌లు సంధించారు. కానీ వీరు అప్ప‌ట్లో స‌మాధానం చెప్ప‌లేదు. అలా అని ఖండించ‌లేదు. అయితే చివ‌ర‌కు ఇటీవ‌లే పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రికీ స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. కానీ అప్ప‌టికే వీరి పెళ్లి జ‌రుగుతుంద‌ని వార్త‌లు వ్యాపించాయి. ఆ త‌రువాత వారు అధికారికంగా కూడా ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే వారు వివాహ బంధంతో ఒక్క‌టి కానున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మీడియాకు కూడా అనుమ‌తి లేద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM