Payal Rajput : త్వ‌ర‌గా ఈ వీడియో చూసేయండి.. మ‌ళ్లీ డిలీట్ చేస్తానంటూ పాయ‌ల్ రాజ్‌పుత్ కామెంట్

November 18, 2023 10:47 AM

Payal Rajput : ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా.. అజయ్ భూపతి తెరకెక్కించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘మంగళవారం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రలు చేశారు. మంగళవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాగా, విడుద‌లైన అన్ని చోట్ల మూవీకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ఒక గ్రామంలో ప్రతి మంగళవారం ఏదో ఒక భయానకమైన సంఘటన జరుగుతూ ఉండ‌గా, అస‌లు అలా జ‌ర‌గ‌డం వెనక కథ ఏంటి? ఎవ‌రు చేస్తున్నారు? అనే అంశాలతో మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది మంగ‌ళ‌వారం. థ్రిల్లర్ ఎలిమెంట్లతో సాగే స్టోరీతో రాబోయే ‘మంగళవారం’ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీనికి డిమాండ్ బాగా వచ్చింది. దీంతో ఇది నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 10.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో రూ. 12.20 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది.

Payal Rajput emotional video after mangalavaram movie release
Payal Rajput

త‌ను న‌టించిన మంగ‌ళ‌వారం సినిమాకి మంచి టాక్ రావ‌డంతో పాయ‌ల్ రాజ్‌పుత్ ఎమోష‌న‌ల్ కామెంట్ చేసింది. చాలా ఎమోషనల్ అవుతూ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ స్పెషల్ వీడియో షేర్ చేయ‌గ‌, ఇందులో నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వలేదు ..ఇలాంటి వీడియోలు కూడా ఎప్పుడు చేయలేదు.. ఈ వీడియో కూడా త్వరగానే డిలీట్ చేసేస్తాను ..ఆడియన్స్ తో కలిసి సినిమా చూడడం చాలా చాలా ఆనందాన్ని నచ్చింది.. సినిమాను హిట్ చేసినందుకు థాంక్యూ ..ఇలాంటి మంచి సినిమాలలో నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అని ఆస‌క్తిక‌ర కామెంట్ చేసింది పాయ‌ల్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now