పవన్‌ అభిమానులకు చేదు వార్త.. సంక్రాంతి రేసు నుండి భీమ్లా నాయ‌క్ ఔట్..!

December 7, 2021 6:39 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ” భీమ్లా నాయక్”. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంపై అంద‌రిలోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల‌ “అడవి తల్లి మాట” సాంగ్ ను విడుదల చేశారు. సింగర్స్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి ఈ సాంగ్ ను పాడగా, లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ థమన్ అందించారు. సాంగ్ లిరిక్స్ అద్భుతంగా ఉండ‌డంతో శ్రోత‌ల‌ను ఎంత‌గానో ఆక‌ర్షించింది.

pawan kalyan bhimla nayak movie may not be released in January

భీమ్లా నాయ‌క్ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక తెలుగు రీమేక్. త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్. ఈ యాక్షన్ మూవీకి మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 12న విడుదల కానుందని గ‌త కొద్ది రోజులుగా చెబుతూ వ‌స్తున్నారు.

జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల కానుండ‌డంతో సంక్రాంతి బరిలో సంద‌డి చేయాల్సిన స‌ర్కారు వారి పాట ఏప్రిల్‌కి వెళ్లింది. భీమ్లా నాయ‌క్ కూడా వాయిదా ప‌డుతుంద‌ని అంద‌రూ భావిస్తున్న క్ర‌మంలో వాయిదా వేసే ప్ర‌స‌క్తే లేద‌ని కొద్దిరోజులుగా వ‌స్తున్న అప్‌డేట్స్ ద్వారా అర్ధ‌మైంది.

కానీ తాజాగా ఈ మూవీని సంక్రాంతి బ‌రి నుండి త‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ప‌లువురు చ‌ర్చ‌లు జ‌రిపించిన త‌ర్వాత సినిమా వాయిదా వేశార‌ని, త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది.

అప్ డేట్‌..

భీమ్లా నాయ‌క్ చిత్ర విడుద‌ల‌ను వాయిదా వేస్తార‌ని, సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉండ‌ద‌ని వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో చిత్ర నిర్మాత నాగ‌వంశీ స్వ‌యంగా స్పందించారు. మూవీ య‌థావిధిగా జ‌న‌వ‌రిలోనే విడుద‌ల అవుతుంద‌ని.. అందులో ఎలాంటి సందేహాల‌కు గురి కావ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని.. తాజాగా స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now