Nithya Menon : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనకి ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా నిత్యామీనన్ ప్రభాస్ మ్యాటర్ తీసుకొచ్చి వార్తలలో నిలిచింది. ‘అలా మొదలైంది’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ నిత్యామీనన్.. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గా కూడా రాణిస్తోంది. పాత్ర నచ్చితే చాలు.. నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తోంది.
నిత్యా మీనన్ తాజాగా భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ సరసన నటించింది. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అలాగే డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 4న విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో నిత్యామీనన్ నిర్మాతగా కూడా మారింది. తాజాగా ఈ అమ్మడు మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చింది.
ప్రభాస్ ఇష్యూపై నిత్యా స్పందించడం గమనార్హం. నాకు ఇండస్ట్రీలో పెద్ద దెబ్బ తగిలింది ప్రభాస్ విషయంలోనే. ఆ ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే ఉంది. నా గురించి ఓ జర్నలిస్ట్ అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను. మానసికంగా చాలా కుంగిపోయాను. అలా మొదలైంది తెలుగులో నా తొలి చిత్రం. ఆ సమయంలో నాకు తెలుగు సరిగా రాదు. తెలుగులో అప్పటి వరకు నేను ఏ సినిమా చూడలేదు. అలాంటి సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగితే అతనెవరో తెలియదని చెప్పాను. ఆ విషయాన్ని చాలా పెద్దిగా చిత్రీకరించారు. అప్పుడే నాకు అర్థమైంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకున్నాను. మాటల గారడీ చేస్తేనే నచ్చుతుందని భావించాను.. అని నిత్యా చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…