Niharika Konidela : విడాకుల త‌ర్వాత జాలీగా గ‌డుపుతున్న నిహారిక‌.. ఎంత మార్పు వ‌చ్చింది..!

November 27, 2023 10:46 AM

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దులు కూతురు నిహారిక ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక విడిపోవడానికి కారణం ఆమె తండ్రి నాగబాబు చేసిన అతి గారాబమే కారణమని తెలుస్తోంది. తన కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచిన నాగబాబు ఆమె ఏది కోరినా కాదనకుండా అందించారు. వివాహమైన తర్వాత అత్తగారింట్లో ఎలా మసలుకోవాలో నేర్పలేదని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు వ్యాఖ్యానిస్తున్నారు. వివాహమైన తర్వాత అత్తగారింట్లో నిహారిక సర్ధుకుపోలేకపోయింది.

గొడ‌వ‌లు వ‌చ్చాక నాగ‌బాబు కొద్దిగా ఇన్వాల్వ్ అయి నిహారిక చేత నాగబాబు వేరు కాపురం పెట్టించాడు. పెళ్లైన తర్వాత నటించే విషయంలో భర్త చైతన్యతో పాటు అత్తారింటి ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయమే భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణమైనట్లు తెలుస్తోంది. రాజీ కోసం నాగబాబు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకవైపు కూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాను చేసిన అతి గారాబం కూతురు విడాకులు తీసుకునేందుకు కారణమైందంటూ తన సన్నిహితుల దగ్గర నాగబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం తానేనంటూ ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది.

Niharika Konidela feels very happy after divorce
Niharika Konidela

విడాకుల త‌ర్వాత నిహారిక చాలా హ్యాపీగా గ‌డుపుతుంది. పెళ్లిని ఆమె సంకెళ్లుగా భావించ‌గా, ఇప్పుడు మాత్రం ప‌క్షిలా విహరిస్తుంది. అత్తింటి వారు తన డ్రీమ్స్ కి అడ్డుపడుతుండగా విడాకులకు మొగ్గు చూపిందని తెలుస్తుంది. ఇటీవ‌ల నిహారిక హైదరాబాద్ లో ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసింది. పెళ్లికి ముందే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ స్థాపించింది. ఈ బ్యానర్లో నిహారిక ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటుంది.ఇటీవ‌ల నిహారిక కొత్త సినిమాని లాంచ్ చేయ‌గా, ఈ సినిమాలో 11 హీరోలు న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now