---Advertisement---

Nandamuri Chaitanya Krishna : డిసెంబ‌ర్‌లో సంద‌డి చేయ‌నున్న నంద‌మూరి హీరో.. అంచ‌నాలు పీక్స్

November 20, 2023 11:40 AM
---Advertisement---

Nandamuri Chaitanya Krishna : విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగు సినిమా స్థాయిని పెంచిన విష‌యం తెలిసిందే. ఆయ‌న సినిమా న‌టుడిగా ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. ఆయ‌న వార‌సుడిగా బాల‌కృష్ణ కూడా సినీ ప‌రిశ్ర‌మలోకి అడుగుపెట్టి అల‌రిస్తున్నారు. త‌ర్వాత చాలా మంది హీరోలు నంద‌మూరి ఫ్యామిలీ నుండి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నటుడు సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దివంగత నటుడు ఎన్టీఆర్‌ కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రీత్‌’ . వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకి దర్శకత్వం వహించ‌గా, ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి న‌టుడు బాల‌కృష్ణ ఫ‌స్ట్ లుక్ లాంఛ్ చేసారు. ఇది ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

నందమూరి చైతన్య కృష్ణ కొన్నాళ్ల క్రితం హీరోగా సినిమాలు చేశారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన సినిమా ‘బ్రీత్. . కుమారుడి కోసం నందమూరి జయకృష్ణ నిర్మాతగా మారారు. బసవతారక రామ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఆయన నిర్మించిన సినిమా ‘బ్రీత్.ఈ చిత్ర రిలీజ్ డేట్ రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు. వైదిక సెంజ‌లియా హీరోయిన్‌గా న‌టిస్తోంది. వెన్నెల కిషోర్‌, కేశ‌వ్ దీప‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో సినిమా తెరకెక్కించారని ఆ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

Nandamuri Chaitanya Krishna movie to release in december
Nandamuri Chaitanya Krishna

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదిత్య వర్మ కళ్ళు తిరిగి పడిపోవడంతో అత‌న‌ని బ్రీత్ ఆస్పత్రికి తీసుకు వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది సినిమా కథ. హీరో డాక్టరా? పేషెంటా? అనే దానిపై ట్రైల‌ర్‌లో పూర్తి క్లారిటీ ఇవ్వ‌లేదు. ‘ప్రాణం కాపాడటం కాదు… తీయడం ఇంకా కష్టం’ అని చైతన్య కృష్ణ చెప్పే డైలాగ్ వింటుంటే… ప్రాణాలు తీస్తున్న వ్యక్తులపై పోరాటం చేస్తున్నట్లు ఉంది. ‘రక్ష’, ‘జక్కన్న’ సినిమాలు తీసిన వంశీకృష్ణ ఆకెళ్ళ ‘బ్రీత్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొద్ది రోజులు క్రితం ఎన్టీఆర్ బావ మ‌రిది మ్యాడ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌గా, ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now