వినోదం

Most Watched Movie in OTT : థియేట‌ర్‌లోనే కాదు ఓటీటీలోను దుమ్మురేపుతున్న ఈ సినిమాని మీరు వీక్షించారా..!

Most Watched Movie in OTT : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆ మ‌ధ్య వ‌రుస ఫ్లాపుల‌తో చాలా ఇబ్బంది ప‌డ్డాడు. ఆయ‌న పని అయిపోయింద‌ని, సినిమాల‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే బెట‌ర‌ని కొంద‌రు సూచ‌న‌లు చేశారు. కాని ప‌డిలేచిన కెరటంలా షారూఖ్ ఖాన్ వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్‌ ఖాన్ సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో ‘పఠాన్‌’ తో కలెక్షన్‌ కోత కోసిన షారూఖ్ ఖాన్.. ద్వితియార్థంలో ‘జవాన్‌’ తో చ‌రిత్ర సృష్టించాడు. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర ‘జవాన్‌’ సినిమా కోట్లు కొల్లగొట్టింది. సుమారు రూ.1068 కోట్లకుపైగా వసూళ్లతో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ సాధించిన హిందీ సినిమా (ఒరిజినల్‌ లాంగ్వేజ్‌)గా కూడా ‘జవాన్‌’ రికార్డు సృష్టించ‌డం విశేషం. ఈ సినిమా ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డు న‌మోదు చేసింది. నవంబర్ 2 న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల్లో బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ చిత్రం. ఇక అక్కడి నుండి డిజి టల్ రిలీజ్ పరంగా కూడా ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ రెండు వారాల్లో తమ ఓటిటి ప్లాట్ ఫామ్ లో అత్యధిక మంది వీక్షించిన మూవీగా జవాన్ రికార్డు క్రియేట్ చేసిందని తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు.

Most Watched Movie in OTT

గతంలో ఆర్ఆర్ఆర్, గంగూభాయి కతీయవాడి, చోర్ నికల్ కె బాగా ఈ రికార్డు ని కలిగి ఉండ‌గా, ఇప్పుడు దానిని జ‌వాన్ బ్రేక్ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో జ‌వాన్ చిత్రం దూసుకెళ్తుండడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ పోషించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరి ఖాన్ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. సెప్టెంబర్ 7న థియేటర్లలో రిలీజైన జవాన్ సినిమా అన్ని భాషల్లోనూ మంచి హిట్ టాక్ సంపాదించింది. జవాన్ మూవీకి ఓటీటీలో 35 లక్షల వ్యూస్ రావ‌డంతో షారూఖ్ ఆనందంతో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు . ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన సినిమాగా జవాన్ నిలిచిందని చెప్పడానికి చాలా థ్రిల్ ఫీలవుతున్నాను అని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM