Meenakshi Chaudhary : మ‌హేష్‌తో ఆడిపాడ‌నున్న మీనాక్షి చౌద‌రి.. ర‌చ్చ మామూలుగా ఉండ‌దు..!

December 4, 2023 10:00 AM

Meenakshi Chaudhary : టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రైన మ‌హేష్ బాబు వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. గత చిత్రంతో మాత్రం మహేశ్ నిరాశనే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ‘గుంటూరు కారం’ మూవీని చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ‘గుంటూరు కారం చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రం గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ రుచి చూపించనున్నారు నిర్మాత ఎస్‌ రాధాకృష్ణ.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో మహేశ్‌, మీనాక్షిలపె ఓ పాటను తెరకెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది . ఈ వారంలోనే ఈ పాట పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. నెలాఖరుకి సినిమా మొత్తం పూర్తి కానుందట. ఇప్పటికే ఓ పాటను విడుదల చేశారు. త్వరలో రెండో పాటను విడుదల చేయనున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.. కుటుంబ సమేతంగా చూడదగ్గ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, మహేశ్‌ మునుపెన్నడూ చేయని మాస్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘గుంటూరు కారం’ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఆ తర్వాత ఇందులో శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే, ఈమె పాత్ర సెకెండ్ లీడ్‌ హీరోయిన్‌గానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా పూజా హెగ్డే త‌ప్పుకోవ‌డంతో శ్రీలీల మెయిన్ లీడ్‌గా మారింది. . దీంతో రెండో హీరోయిన్‌గా హిట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.

Meenakshi Chaudhary to play song in guntur karam
Meenakshi Chaudhary

గుంటూరు కారం చిత్రంలో మ‌హేష్ బాబు, మీనాక్షి కాంబినేషన్ సీన్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయట. వీళ్లిద్దరి మధ్య కాస్త సరసం, టీజింగ్ సన్నివేశాలు మెప్పిస్తాయని తెలిసింది. దీంతో ఈ కాంబోపై ఆసక్తి పెరిగిపోతోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.ఈ చిత్రంతో మీనాక్షి విజ‌యం అందుకుంటుంద‌ని అంద‌రు భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now