Mangalavaram Day 1 Collections : ఆర్ఎక్స్ 100 మూవీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మంగళవారం. స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన రిలీజ్ కాగా, మొదటి నుండి ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇదే. హైపర్ సెక్సువల్ డిజార్డర్ అనే టిపికల్ పాయింట్‌తో ఫన్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన మంగళవారం సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ చిత్రం వంద రోజుల పాటు ఔట్ డోర్ షూటింగ్, యాక్టర్ల పారితోషికాలతో కలిపి మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లకుపైగానే అయినట్టు తెలుస్తుంది. కథ డిమాండ్ చేయడం, క్వాలిటీ కోసం రాజీ పడకూడదనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ చిత్రానికి భారీగానే ఖర్చు పెట్టారు. పల్లెటూరి నేపథ్యంతో భయపెట్టే కథతో రూపొందిన మంగళవారం సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.ఈ సినిమాకి సుమారుగా 27 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ రిపోర్టు. డిమాండ్‌కు తగినట్టుగా నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేయగా.. ఆంధ్రాలో పలువురు డిస్ట్రిబ్యూటర్లు భారీగా చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకొన్నారు.
తొలి రోజు ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. నైజాం ఏరియాలో ఈ సినిమా కోటి వరకు కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తుండగా, శనివారం రోజు కూడా దాదాపు రెండు కోట్ల వరకు ఈ మూవీ షేర్‌కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. మొత్తానికి మంగళవారం చిత్రం తొలిరోజే దాదాపు రెండున్నర కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టడంతో ఫస్ట్ వీక్‌లోనే మంగళవారం లాభాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…