Rules Ranjan OTT Release Date : థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకి ప్రతి సినిమా కూడా ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమా కూడా ఓటీటీలో రచ్చ చేసేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు మాత్రమే వైవిధ్యాన్ని చూపిస్తూ.. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకడు. మొదటి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత కూడా పలు హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వరుస పెట్టి ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా కిరణ్ ‘రూల్స్ రంజన్’ అనే ఫన్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ రూపొందించిన క్రేజీ మూవీనే ‘రూల్స్ రంజన్ చిత్రానికి యూఎస్‌లోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి అదే టాక్ కంటిన్యూ అయింది. అయితే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఏమంత బాగా రాలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ఓటీటీలోకి విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. తాజాగా ‘రూల్స్ రంజన్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్, డేట్ వివరాలు బయటకు వచ్చాయి. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకున్నట్టు తెలుస్తుండగా, అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించనుంది. ఇక కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో రూపొందిన రూల్స్ రంజన్’ మూవీలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను స్ట్రైట్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో దివ్యాంగ్, వేమూరి మురళీ కృష్ణ నిర్మించారు. ఇందులో మెహర్ చహల్, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, సుబ్బరాజు, వైవా హర్ష వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించారు. చిత్రంలో కామెడీ ఆశించిన స్టాయిలో వర్కవుట్ కాకపోవడంతో రూల్స్ రంజన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నది. కేవలం కోటిన్నర వరకు మాత్రమే వసూళ్లను రాబట్టి నిర్మాతలుకు నష్టాలను మిగిల్చింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…